AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్, మటన్ వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఎక్కువ టైమ్ లేక వారం రోజుల మాంసాహారాన్ని ఒకేసారి తెచ్చి ఫ్రిజ్‌లో దాచుకునేవాళ్లే ఎక్కువ. అయితే బిజీ లైఫ్ పేరుతో మీ ఆరోగ్యాన్ని మీరే రిస్క్‌లో పడేసుకుంటున్నారని మీకు తెలుసా? అవును.. మీరు ఈ నిజం తెలుసుకోవాల్సిందే.. ఫ్రిజ్‌లో దాచిన మాంసం మీకు శక్తిని ఇస్తుందో లేక సైలెంట్ పాయిజన్‌గా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

చికెన్, మటన్ వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
Raw Meat Storage Safety Tips
Krishna S
|

Updated on: Feb 05, 2026 | 10:04 AM

Share

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు వీకెండ్స్‌లోనే వారానికి సరిపడా మాంసాహారాన్ని కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఈ సౌకర్యం వెనుక పొంచి ఉన్న అనారోగ్య ముప్పుల గురించి పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన 48 గంటల తర్వాత అది తన సహజమైన పోషక విలువలను కోల్పోవడం ప్రారంభిస్తుంది. కేవలం పోషకాలు పోవడమే కాకుండా అది బ్యాక్టీరియా వృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుంది. కొనుగోలు చేసిన రెండు రోజుల్లోపు మాంసాన్ని వండుకోవడమే ఆరోగ్యానికి అత్యంత సురక్షితం.

సరైన నిల్వ పద్ధతి ఏది?

ఒకవేళ మీరు మాంసాన్ని నిల్వ చేయక తప్పని పరిస్థితి ఉంటే ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు..

  • మాంసాన్ని తెచ్చిన వెంటనే శుభ్రం చేసి, తేమ లేకుండా ఆరనివ్వాలి.
  • గాలి చొరబడని డబ్బాల్లో లేదా జిప్ లాక్ బ్యాగుల్లో ఉంచాలి.
  • మామూలు ఫ్రిజ్ సెక్షన్ కంటే డీప్ ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల మందగిస్తుంది.
  • ఒకసారి ఫ్రీజర్‌లో ఉన్న మాంసాన్ని బయటకు తీసి, మంచు కరిగిన తర్వాత మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టడం అత్యంత ప్రమాదకరం. దీనివల్ల బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది.

చెడిపోయిందని గుర్తించడం ఎలా?

మీరు నిల్వ ఉంచిన మాంసంలో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే పారేయండి..

ఇవి కూడా చదవండి
  • మాంసం ఎరుపు రంగు నుంచి బూడిద లేదా ఆకుపచ్చ రంగులోకి మారడం.
  • ఘాటైన లేదా కుళ్లిన వాసన రావడం.
  • మాంసం ఉపరితలంపైన జిగటగా అనిపించడం.

ఆరోగ్య ముప్పులు

కలుషితమైన లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉన్న మాంసాన్ని తీసుకోవడం వల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. ఇది వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి మాత్రమే కాకుండా, దీర్ఘకాలంలో జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us