AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్‌కి పవర్.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఒక్క లవంగం తిన్నా చాలు బోలెడు లాభాలు మీ సొంతం..

లవంగాలలో ఎన్నో పోషకాలతోపాటు.. ఔషధ గుణాలు దాగున్నాయి.. లవంగాలు వంటలకు మంచి రుచి, సువాసనను ఇస్తాయి. కానీ వాటి వినియోగంపై అపోహలున్నాయి. నిజానికి, తగిన మోతాదులో వాడితే పొట్ట, అన్నవాహిక అల్సర్‌లను నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి. అయితే, మోతాదు మించితే మంట, ఇతర సమస్యలు రావచ్చని 2014 పరిశోధనలు తెలుపుతున్నాయి.

పవర్‌కి పవర్.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఒక్క లవంగం తిన్నా చాలు బోలెడు లాభాలు మీ సొంతం..
Clove Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Feb 05, 2026 | 9:55 AM

Share

లవంగాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. లవంగాలు (Cloves) మాంగనీస్, విటమిన్ K, విటమిన్ C, ఫైబర్‌తో కూడిన అత్యంత పోషకమైన సుగంధ ద్రవ్యాలుగా పరిగణిస్తారు. దీనిలోని యూజెనాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఎన్నో సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే.. వంటకాలకు సువాసన, రుచిని అందించే లవంగాలు మన దైనందిన ఆహారంలో ఒక భాగం.. అయితే, లవంగాలు ఎక్కువైతే పొట్టలో మంట, అసౌకర్యం, అల్సర్‌లు వంటి సమస్యలు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. ఇది కొంతమందిలో వేడి చేసిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. అయితే, లవంగాలపై జరిగిన శాస్త్రీయ పరిశోధనలు ఈ అపోహను పాక్షికంగా తొలగిస్తూ ఒక కీలకమైన వాస్తవాన్ని వెల్లడించాయి. లవంగాలు సరైన మోతాదులో ఉపయోగించినప్పుడు, అవి పొట్టలో, అన్నవాహికలో (ఆహార నాళం) అల్సర్‌లు ఏర్పడకుండా అద్భుతంగా రక్షించగలవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

లవంగాలలో ఉండే ప్రత్యేకమైన ఘాటుకు కారణమైన రసాయన సమ్మేళనాలు.. మనం తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థలోని జిగురు పొరలను (mucous membranes) ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రేరణ వల్ల జిగురును ఉత్పత్తి చేసే కణజాలం క్రియాశీలమై, కడుపు, అన్నవాహిక గోడలపై రక్షణ కవచంలా పనిచేసే జిగురు ఎక్కువగా స్రవించేలా చేస్తుంది. ఈ జిగురు పెరగడం వల్ల కడుపులో మంటలు, అల్సర్‌లు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. ఎర్ర కారం వంటి వాటి ఘాటుకు ఇలాంటి రక్షణ యంత్రాంగం ఉండదు.. కానీ లవంగాల ఘాటుకు ఈ విశిష్ట ప్రయోజనం ఉంది.

అయితే, ఈ ప్రయోజనం మోతాదుకు లోబడి ఉంటుంది. మూడు లేదా నాలుగు లవంగాలను మించి వాడకుండా ఉంటేనే పొట్టలో, అన్నవాహికలో అల్సర్‌ల నుండి రక్షణ లభిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ మోతాదుకు మించి, అనగా నాలుగైదు లవంగాల కంటే ఎక్కువ వాడినప్పుడు, లవంగాలలో ఉండే రసాయన ప్రభావం అధికమై రివర్స్ సైడ్ ఎఫెక్ట్‌లకు దారితీస్తుంది. ఈ అధిక ప్రభావం వల్ల మంట, ఇరిటేషన్ ఎక్కువైపోయి అసౌకర్యం కలుగుతుంది.

ఈ పరిశోధనల వివరాలను 2014వ సంవత్సరంలో బ్రెజిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సావోపాలో అందించింది. అందుకనే, లవంగాలు రోజూ వాడితే మంటలు, అల్సర్‌లు వస్తాయనే అపోహ ఉన్నప్పటికీ, సరైన మోతాదులో ఉపయోగించడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. చాలామంది వెజిటేరియన్ వంటకాల్లో లవంగాలు లేకుండా మసాలాలు వాడతారు.. అయితే ప్రత్యేక వంటకాల్లో, ముఖ్యంగా నాన్-వెజ్ వంటకాల్లో గుమగుమలాడే రుచి కోసం లవంగాలు వాడుతుంటారు. కానీ, తగు రీతిలో వాడుకున్నప్పుడు మాత్రమే లవంగాల వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందగలమని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే మోతాదుకు మించకుండా లవంగాలను వాడకూడదు..

అయితే లవంగాలు వేడి స్వభావాన్ని కలిగి ఉ:టాయి.. రోజుకు ఒకటి – రెండు తిన్నా కూడా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డైలీ లవంగాలను తింటే.. మీ శరీరంలో జరిగేది ఇదే..
డైలీ లవంగాలను తింటే.. మీ శరీరంలో జరిగేది ఇదే..
బిస్కెట్లపై రంధ్రాల వెనక షాకింగ్ నిజం.. ఆ రహస్యం బయటపడింది!
బిస్కెట్లపై రంధ్రాల వెనక షాకింగ్ నిజం.. ఆ రహస్యం బయటపడింది!
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
టీ20 ప్రపంచకప్‌లో భయం లేని బ్యాటర్లు వీరే.. బరిలోకి దిగితే
టీ20 ప్రపంచకప్‌లో భయం లేని బ్యాటర్లు వీరే.. బరిలోకి దిగితే
చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి..! ఆ ప్రాంతాల్లో గజ గజ..
చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి..! ఆ ప్రాంతాల్లో గజ గజ..
నేటి నుంచి దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు.. అతి తక్కువ ధరకే..
నేటి నుంచి దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు.. అతి తక్కువ ధరకే..
మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది..!
మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది..!
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్
నారింజ తొక్కలను పారేస్తున్నారా? ఆగండి.. మీ ఆరోగ్యాన్ని, అందాన్ని
నారింజ తొక్కలను పారేస్తున్నారా? ఆగండి.. మీ ఆరోగ్యాన్ని, అందాన్ని
ఆరోగ్యమే మహాభాగ్యం.. మెంతుల పవర్ తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
ఆరోగ్యమే మహాభాగ్యం.. మెంతుల పవర్ తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..