AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 11 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..12 రాశుల వారికి ఇలా..

Horoscope Today: జూన్ 11, 2026 గురువారం రాశిఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఆర్థిక, వృత్తి పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి లభించే అవకాశం ఉండగా, ఆదాయంలో కూడా పెరుగుదల కనిపిస్తుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, ఆకస్మిక ఖర్చులు కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. మిథున రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువ విజయాన్ని అందించే సూచనలు ఉన్నాయి. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ గురువారం గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.

జూన్ 11 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..12 రాశుల వారికి ఇలా..
Horoscope Today 11 June 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 11, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూన్ 11, 2026): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. మిథున రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సఫలం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితంలో మీ పనితీరుకు, సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృథా ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. వ్యాపారాల్లో పోటీదార్ల మీద తప్పకుండా పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. బంధు మిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో మరింతగా లాభపడే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ఆదరణ, అభిమానాలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సఫలం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కూడా చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి బాగా పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అనుకోకుండా లాభాలు వృద్ది చెందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి. ప్రయా ణాలు పెట్టుకోవద్దు. ఆర్థిక లావాదేవీలకు, ధనపరమైన వాగ్దానాలకు దూరంగా ఉండడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూ లంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. భూ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబ జీవితం సామర స్యంగా సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగానే ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత పురోగతికి అవకాశం ఉంది. ధనపరంగా రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అను కోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు. జీవిత భాగ స్వామితో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. కొన్ని ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవ కాశం ఉంది. ప్రాభవం పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. కొత్తగా ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగు పడుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమానంగా అధికారాలను అనుభవిస్తారు. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. తల్లితండ్రుల ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆహార, విహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవ కాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి జీవి తంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయ త్నాలు బాగా సానుకూలంగా సాగిపోతాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యో గంలో అధికారం చేపడతారు. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Follow Us