AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: జాక్ ఎక్కడ..? చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి.. ఈ ప్రాంతాల్లో గజ గజ..

ఊరవతల కొండమీదుండే పెద్దపులి.. ఏ నిమిషంలోనైనా మీ నట్టింట్లోకి జొరబడొచ్చు. పొలం పనులకు ఒంటరిగా వెళ్లొద్దు.. పశువుల్ని బైటికే వదలొద్దు.. అని నిన్నటిదాకా దండోరా వేశారు. మరి, తమ ఊరిచుట్టూనే తిరుగుతున్న పెద్దపులిని ఎప్పటికి పట్టుకుంటారు, టైగర్ టెర్రర్‌ నుంచి ఆ జనానికి ఎలా రిలీఫ్ నిస్తారు? ఆపరేషన్ జాక్ హంట్ ఎంతవరకొచ్చినట్టు?

Andhra: జాక్ ఎక్కడ..? చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి.. ఈ ప్రాంతాల్లో గజ గజ..
Tiger Hunt
Shaik Madar Saheb
|

Updated on: Feb 05, 2026 | 9:30 AM

Share

రాత్రిలోగా పట్టుకుంటాం.. బంధించి అడవిలో విడిచిపెడతాం… బేఫికర్ అని భరోసానిచ్చిన ఫారెస్టధికారులు ఇప్పుడెక్కడ? తడోబా నుంచి దారితప్పి తూర్పుగోదావరిలోకి ఎంట్రీ ఇచ్చి, రాజానగరాన్ని వణికిస్తున్న మూడున్నరేళ్ల మగపులి.. మిస్టర్ జాక్.. ఇప్పటికీ నో ఆచూకీ. మరి.. ‘ఆపరేషన్ జాక్ హంట్’ కంటిన్యూ ఔతోందా? పూణే నుంచి వచ్చిన ఎక్స్‌పర్ట్స్ చేతులెత్తేసినట్టేనా?

రాజానగరం సమీప గ్రామాల్లో, జనసంచారం ఎక్కువగా ఉండే దివాన్ చెరువు, ఆటోనగర్‌ ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు కనిపించడంతో.. జనానికి ఐదురోజులుగా కంటిమీద కునుకు లేదు. అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నా.. పులి జాడను పసిగట్టలేకపోయారు.

పగటిపూట పడుకుని, రాత్రుళ్లు మాత్రమే వేటకు వెళ్లడం పెద్దపులుల అలవాటు. మరి, నాలుగు రాత్రులు ఇక్కడిక్కడే తిరిగింది. నిన్నటి రాత్రి కూడా దొరక్కుండా ఎస్కేపైంది. నైన్టీ పర్సెంట్ జీడిమామిడి తోటల్లోనే ఉంటుందని తెలిసినా, వల వేసి చెరపట్టలేకపోయారు అధికారులు. సో, పెద్ద పులి స్టిల్ ఆన్ రన్.. పట్టుకోండి చూద్దాం అని దొంగాటాడుతోంది.

దట్టమైన పొదలు, చెరుకు తోటల్లో నక్కి ఉందన్న అనుమానంతో డ్రోన్ కెమెరాలతో పులి కదలికలపై నిఘా పెట్టారు. కానీ, పగలంతా పడుకునే ఉంటుంది గనుక, రాత్రికి ఆకలేసినప్పుడే వేటకు తయారౌతుంది. మరి, రాత్రిదాకా వెయిట్ చెయ్యాల్సిందేనా? బాడీ హీట్‌ను బట్టి పులి ఆనవాళ్లను పసిగట్టే థర్మల్ కెమెరాలు కూడా ఆన్ అయ్యాయి. కానీ, బాగా చీకటి పడినతర్వాతే ఈ కెమెరాలు పనిచేస్తాయట.

రోజుకి 16 నుండి 20 కిలోమీటర్ల వరకు నడవగలిగే పెద్దపులి.. ఈ నాలుగు రోజుల్లో ఎంతదూరం వెళ్లి ఉంటుంది.. లేక ఉన్నచోటే ఉండి కదలకుండా అధికారులను ఏమారుస్తోందా? ఒక్కో పులికి ఆకలేస్తే రోజుకు 40 కేజీల మాంసం అవసరమౌతుంది. దాక్కున్న పులికి మాంసాన్ని ఎరవేసి బైటికి లాగొచ్చన్న ఆలోచన కూడా ఒకటుంది. ఆహారంగా పశువుల్ని ఆశ చూపి దగ్గరగా పంపితే.. పులి బైటికొస్తుందని, వెంటనే వల వేసి, మత్తుమందిచ్చి, బోనెక్కించవచ్చని చూస్తున్నారు.

గాలింపు చర్యల కోసం లోకల్‌గా ఉండే 12 టీమ్స్‌తో పాటు, పూణే నుంచి స్పెషల్‌గా మరో టీమ్‌ వచ్చింది. ఇంతమంది కలిసి ఒక్క పులి కోసం వేట.. అదే ఆపరేషన్ జాక్ హంట్.. ఎలా ఎప్పటికి ముగింపుకొస్తుంది? టైగర్ ఫియర్ నుంచి రాజానగరం బైటపడేదెలా?..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us