FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఒక సంవత్సరం పాటు కీలక పాలసీ రేట్లను మార్చకపోవడంతో పాటు అన్ని బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటును అధిగమించి అధిక స్థాయిలలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అందించే ప్రస్తుత వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మన దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు విశ్వసించే పెట్టుబడి పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ). మంచి వడ్డీ రేటుతో స్థిరమైన రాబడి, భద్రత ఉండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెడతారు. అయితే వీటిల్లో వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. బ్యాంకు బ్యాంకుకూ రేట్లుమారుతుంటాయి. ఎక్కువశాతం మంది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. అయితే మన దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో కూడా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేటును అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఒక సంవత్సరం పాటు కీలక పాలసీ రేట్లను మార్చకపోవడంతో పాటు అన్ని బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటును అధిగమించి అధిక స్థాయిలలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అందించే ప్రస్తుత వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రైవేటు బ్యాంకుల్లో ఎఫ్‌డీ..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో డిపాజిటర్ వయసు ఆధారంగా ఎఫ్‌డీ రేటు గరిష్టంగా 7.75శాతంగా ఉంది. అదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఏటా 7.75 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ సంవత్సరానికి 7.85 శాతం వరకు ఇస్తోంది. ఈ మూడు బ్యాంకుల్లో వడ్డీ రేట్లపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..
ఈ బ్యాంకులో రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తాజా వడ్డీ రేట్లు(వార్షికం) వివరాలు ఇవి..
- 7 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
- 46 రోజుల నుంచి 6 నెలల వరకూ: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
- 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
- 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
- 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.60 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం
- 15 నెలల నుంచి 18 నెలల వరకూ: సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
- 18 నెలల నుంచి 21 నెలల వరకూ: సాధారణ ప్రజలకు – 7.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
- 21 నెలల నుంచి 2 సంవత్సరాల 11 నెలల వరకూ: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
- 2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 7.15 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.65 శాతం
- 2 సంవత్సరాల 11 నెలలు 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల వరకూ: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
- 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 7.20 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.70 శాతం
- 4 సంవత్సరాల 7 నెలలు 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు..
- 7 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
- 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
- 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
- 91 రోజుల నుంచి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
- 185 రోజుల నుంచి 270 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
- 271 రోజుల నుంచి 289 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
- 290 రోజుల నుంచి 1 సంవత్సరం వరకూ: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
- 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకూ: సాధారణ ప్రజలకు – 6.70 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.20 శాతం
- 15 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.20 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
- 2 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 6.90 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం.
యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు..
- 7 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
- 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
- 61 రోజుల నుంచి 3 నెలల వరకూ: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
- 3 నెలల నుంచి 3 నెలల 24 రోజులు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
- 3 నెలల 25 రోజుల నుంచి 6 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
- 6 నెలల నుంచి 7 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
- 7 నెలల నుంచి 9 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
- 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
- 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకూ: సాధారణ ప్రజలకు – 6.70 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.20 శాతం
- 15 నెలల నుంచి 17 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.60 శాతం
- 17 నెలల నుంచి 18 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 7.20 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.85 శాతం
- 18 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.60 శాతం
- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..