AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Taxi: దేశ ప్రజలకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్.. నేటి నుంచే భారత్ ట్యాక్సీ సేవలు.. తక్కువ ధరకే ప్రయాణం..

దేశంలోని ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా భారత్ ట్యాక్సీ యాప్‌ను ఫిబ్రవరి 5న లాంచ్ చేసింది. ఈ మేరకు కేంద్రహోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా యాప్ ప్రారంభమైంది. రాబోయే రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా యాప్ విస్తరించనున్నారు.

Bharat Taxi: దేశ ప్రజలకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్.. నేటి నుంచే భారత్ ట్యాక్సీ సేవలు.. తక్కువ ధరకే ప్రయాణం..
Bharat Taxi
Venkatrao Lella
|

Updated on: Feb 05, 2026 | 9:18 AM

Share

దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి పెద్ద పీట వేస్తోంది. ఇక రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు ప్రజలు వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా రైళ్ల వేగం సమార్థ్యాన్ని పెంచుతోంది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లుగా భావించే వందే భారత్ రైళ్లు తీసుకురాగా.. ఇటీవల బడ్జెట్‌లో హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించింది. ఇవి పూరైతే దేశంలో బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు క్యాబ్ సేవలను కూడా ప్రారంభించింది. తక్కువ ధరకే వేగంగా, సురక్షితంగా ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించేలా భారత్ ట్యాక్సీ పేరుతో యాప్‌ను లాంచ్ చేసింది.

నేడు భారత్ ట్యాక్సీ యాప్ ప్రారంభం

ర్యాపిడో, ఊబర్, ఓలా లాంటి ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు పోటీగా భారత్ ట్యాక్సీ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గత రెండు నెలల క్రితం కొన్న నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ యాప్ సేవలను పలు నగరాల్లో ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో జనవరి 5న యాప్‌ను కేంద్రం అధికారికంగా లాంచ్ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత్ ట్యాక్సీ యాప్‌ను గురువారం ప్రారంభించారు. రాబోయే రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, సిటీలు, పట్టణాల్లో ఈ యాప్ ద్వారా క్యాబ్ సేవలను విస్తరించనున్నారు. బైక్, కార్, ఆటో సేవలు ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలు ఉపయోగించుకోవచ్చు. ప్రైవేట్ యాప్‌ల్లో ఛార్జీలు అధికంగా ఉంటున్నాయి. పీక్ అవర్స్‌లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలకు భారం తగ్గించేందుకు కేంద్రమే క్యాబ్ సర్వీసుల యాప్‌ను తీసుకొచ్చింది.

జీరో కమిషన్

ప్రైవేట్ క్యాబ్ సంస్ధలు డ్రైవర్ల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నాయి. దీంతో ఆ యాప్‌ల్లో రిజిస్ట్రర్ చేసుకుని సేవలు అందించే డ్రైవర్లను ఎక్కువ ఆదాయం లభించలేదు. అయితే భారత్ ట్యాక్సీ యాప్‌లో ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. దీంతో ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం మొత్తం డ్రైవర్‌కే వెళ్తుంది. దీని వల్ల డ్రైవర్లకు అధిక ఆదాయం లభించి వారికి బెనిఫిట్ జరగనుంది. అలాగే డ్రైవర్లకు హెల్త్ ఇన్యూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్యూరెన్స్, పదవీ విరమణ పొదుపులు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన డ్రైవర్లను సంత్కరించడం, వారికి ప్రోత్సహకాలు అందించడం లాంటివి చేస్తారు. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రైవేట్ సంస్ధలతో కేంద్రం భాగస్వామ్యం కానుంది.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?