AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల భక్తులకు ఇకపై నాణ్యమైన ఆహారం.. టీటీడీ కీలక నిర్ణయం.. మార్చి నుంచే..

తిరుమల లడ్డూ కల్తీ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతూనే ఉంది. ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు కల్తీ లేని ఆహారం అందించేందుకు త్వరలో ల్యాబ్ ఏర్పాటుకు సిద్దమవుతోంది.

Tirumala: తిరుమల భక్తులకు ఇకపై నాణ్యమైన ఆహారం.. టీటీడీ కీలక నిర్ణయం.. మార్చి నుంచే..
Tirumala
Venkatrao Lella
|

Updated on: Feb 05, 2026 | 8:25 AM

Share

కలియుగ ప్రత్యక్ష దైవంగా అందరూ భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు రోజూ లక్షలాది మంది భక్తులు కోండపైకి చేరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం రోజూ 70 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం టీటీడీ కల్పిస్తుండగా.. హుండీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. కల్తీ లేని ఆహార పదార్ధాలు భక్తులకు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహాకారంతో తిరుమలలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(FSSAI) ల్యాబ్ ఏర్పాటు చేయనుంది. కేంద్రంతో పాటు ఏపీ ఆరోగ్య భద్రతా విభాగంతో కలిసి టీటీడీ ఈ ల్యాబ్ ఏర్పాటుకు రెడీ అయింది. ఈ ల్యాబ్‌ ద్వారా కల్తీ లేని నాణ్యమైన ఆహారం భక్తులకు అందేలా చేయనుంది.

మార్చిలో ల్యాబ్ ప్రారంభం

అతి తక్కువ మోతాదులో ఆహారం కల్తీ జరిగినా ఈ ల్యాబ్ ద్వారా తెలుసుకోవచ్చు. అతి సౌక్ష్మస్థాయిలోని కల్తీని కూడా గుర్తించే అవకాశం లభించనుంది. మొత్తం 15 పరికరాలు ఈ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్‌లో అందుబాటులో ఉంటాయి. హై ఫర్‌ఫార్మెన్స్ లిక్విడ్ క్రమోగ్రాఫ్, గ్యాస్ క్రొమటోగ్రాప్, ఐసీపీఎంసీ వంటి 15 రకాల పరికరాలు అమర్చనున్నారు. ఈ పరికరాల ద్వారా ఆహార కల్తీని ఈజీగా గుర్తించవచ్చు. మార్చి నుంచి ఈ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. టీటీడీ ఇప్పటికే తిరుమలలో నీరు, ఆహార పదార్థాల నాణ్యత తెలుసుకునేందుకు ల్యాబ్ ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌కు సమీపంలోనే కేంద్ర ప్రభుత్వ సహాకరాంతో ఈ కొత్త ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కేంద్ర కొత్త ల్యాబ్ కోసం రూ.20 కోట్లతో కొత్త పరికరాలను ఇప్పటికే కొనుగోలు చేసింది. వీటిని ఈ ల్యాబ్‌లో అమర్చుతున్నారు.

ప్రారంభంపై టీటీడీ ఈవో సమీక్ష

తాజాగా ఈ ల్యాబ్‌ను టీటీడీ ఇంచార్జ్ ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. ల్యాబ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రారంభించేందుకు అన్నీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తిరుమల లడ్డూ కల్తీ అంశం రాష్ట్రంలో సంచలనంగా మారింది. గత కొద్ది నెలలుగా ఈ అంశంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. ఇప్పటికే సిట్ విచారణ చేపడుతోంది. తిరుమలకే కాకుండా శ్రీశైలం ఆలయానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ గుర్తించింది. 2022 నుంచి 2023 వరకు కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ చెబుతోంది. అప్పటివరకు శ్రీశైలంకు విజయ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. కానీ ఆ తర్వాత తిరుపతికి చెందిన రాజేశ్ కార్పొరేషన్ నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. అయితే ఈ నెయ్యిలో కొన్ని రసాయనాలు కలిసినట్లు సిట్ చెబుతోంది.

Follow Us
జస్ట్ రూ.10 ఖర్చుతో బాత్రూమ్ టైల్స్, ట్యాప్‌లు మిల మిల మెరుస్తాయ్
జస్ట్ రూ.10 ఖర్చుతో బాత్రూమ్ టైల్స్, ట్యాప్‌లు మిల మిల మెరుస్తాయ్
మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత
మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత
‘వర్క్ ఫ్రమ్ బైక్’ యువకుడికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
‘వర్క్ ఫ్రమ్ బైక్’ యువకుడికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..