Mini AC: ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.! కూలర్ కంటే చౌక..

సూర్యుడు భగభగలను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఏసీల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో మధ్యతరగతి ప్రజలు తక్కువ బడ్జెట్‌లో వచ్చే కూలర్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.

Mini AC: ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.! కూలర్ కంటే చౌక..
Ac Portable
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 26, 2024 | 9:52 PM

సూర్యుడు భగభగలను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఏసీల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో మధ్యతరగతి ప్రజలు తక్కువ బడ్జెట్‌లో వచ్చే కూలర్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆన్‌లైన్ మార్కెట్‌లో వీటి కంటే పోర్టబుల్ కూలర్ లేదా ఏసీలకు భారీ డిమాండ్ ఉంది. మీరు ఈ పోర్టబుల్ ఏసీలతో ఇల్లంతటిని కూడా క్షణాల్లో చల్లబరచవచ్చు. ఇవి అతి తక్కువ బడ్జెట్‌లోనే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి.

చాలా కంపెనీలు తమ మినీ ఎయిర్ కండీషనర్‌లు, కూలర్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంచాయి. ఈ మినీ ఏసీలు రూ. 400 నుంచి ప్రారంభమై రూ. 2 వేల వరకు లభిస్తున్నాయి. ఆన్‌లైన్ మాత్రమే కాదు.. ఆఫ్‌లైన్‌లోనూ ఇవి దొరుకుతున్నాయి. కేవలం లీటర్ వాటర్‌తో ఈ మినీ ఏసీ ద్వారా మీరు ఇల్లంతటిని కూల్.. కూల్‌గా చేసేయొచ్చు. ఇవి USB కనెక్టర్లతో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈజీగా ఛార్జ్ చేయవచ్చు. అలాగే మీరు వాటిని ఫుల్ ఛార్జ్‌తో 3 నుంచి 5 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ మినీ ఏసీల్లో మూడు మోడ్‌లు(తక్కువ, మీడియా, హై-స్పీడ్) లభిస్తున్నాయి.(Source)