Vehicle Prices: వాహనాలు కొనేవారికి షాక్‌.. మళ్లీ పెరగనున్న ధరలు! ఎప్పటినుంచంటే?

Money9: ఈ ఏడాదిలో ఇప్పటికే పలుమార్లు వాహన ధరలను పెంచి షాకిచ్చాయి తయారీ కంపెనీలు. అయితే రానున్న పండుగ సీజన్‌ లోపు మరోసారి ధరల పెంపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Vehicle Prices: వాహనాలు కొనేవారికి షాక్‌.. మళ్లీ పెరగనున్న ధరలు! ఎప్పటినుంచంటే?
Vehicle Prices
Follow us
Basha Shek

|

Updated on: Jul 26, 2022 | 8:36 PM

Money9: ఈ ఏడాదిలో ఇప్పటికే పలుమార్లు వాహన ధరలను పెంచి షాకిచ్చాయి తయారీ కంపెనీలు. అయితే రానున్న పండుగ సీజన్‌ లోపు మరోసారి ధరల పెంపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో ముడి సరుకుల ధరలు తగ్గినప్పటికీ, వాహనాల తయారీ కంపెనీలు కోల్పోయిన మార్జిన్‌లను తిరిగి పొందడానికి ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా గత మునుపటి ధరల పెంపులో, ఆటో కంపెనీలు పెరిగిన ఇన్‌పుట్ ధరను వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేయలేదు. అయితే ఇప్పుడు వాహనాల ధరలను పెంచడం ద్వారా పెరిగిన ఇన్‌పుట్ ధరను వినియోగదారులకు అందించాలని ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు భావిస్తున్నాయి. దీనికి తోడు రూపాయి మారకం విలువ బలహీనపడడం, రవాణా వ్యయం పెరగడంతో వాహనాల తయారీ సంస్థలు పలు ఆటుపోట్లను ఎదుర్కొంటటున్నాయి. ఈ క్రమంలోనే తమ వాహనాల ధరలను పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రియం కానున్న ధరలు..

సెప్టెంబర్ త్రైమాసికంలో వాహనాల టైర్లతో పాటు ఇతర ఆటో మొబైల్‌ పరికరాల ధరలు కూడా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీటి తయారీదారులు కూడా దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ నిర్ణయాలతో వాహనాల తయారీ వ్యయం మరింత ప్రియం కానుంది. ఇది క్రమంగా ఆటోమొబైల్‌ కంపెనీలకు భారంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే వాహనాల ధరలను పెంచాలనే యోచనలో ఉన్నాయి ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా వాహనాల ధరల్లో హెచ్చుతగ్గుల సమచారం కోసం అలాగే స్టాక్‌మార్కెట్‌ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్నులు, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలను పలు భాషల్లో సులభంగా తెలుసుకోవచ్చు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.