Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan Apps: అప్పుల కోసం లోన్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా..? ప్రమాదంలో పడకముందే మేల్కోండిలా..

లోన్ అప్లికేషన్ మోసాలకు పాల్పడే రాకెట్ గ్రూపులు.. అవాంతరాలు లేని రుణాన్ని అందిస్తామన్న పేరుతో ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దొచుకుంటున్నారు.

Loan Apps: అప్పుల కోసం లోన్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా..? ప్రమాదంలో పడకముందే మేల్కోండిలా..
Fraud
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 26, 2022 | 4:51 PM

Loan App Fraud – SBI safety tips: ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు పరిపాటిగా మారుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొంతమంది తమ పరి పరిజ్ఞానం, తెలివితేటలను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ మోసాలు మరి ఎక్కువయ్యాయి. ఇలాంటి వాటిలో ఎక్కువగా బ్యాంకింగ్ మోసాలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించి మరి నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా లోన్ అప్లికేషన్ మోసాలకు పాల్పడే రాకెట్ గ్రూపులు.. అవాంతరాలు లేని రుణాన్ని అందిస్తామన్న పేరుతో ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దొచుకుంటున్నారు. అందుకే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.

అటువంటి రుణ మోసగాళ్లకు వ్యతిరేకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించింది. రుణ అప్లికేషన్ మోసాలకు గురికాకుండా ఉండేందుకు 6 భద్రతా చిట్కాలను పంచుకుంది. స్మార్ట్ ఫోన్లలో త్వరగా రుణాలను ఎంచుకునే సమయంలో తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలని సూచించింది. దీంతో మోసాల నుంచి బయటపడొచ్చని పేర్కొంది. ‘‘అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి.. బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ కంపెనీలుగా మోసాలకు పాల్పడుతున్న కంపెనీలకి మీ సమాచారాన్ని అందించడం మానుకోండి. సైబర్ నేరాలచడ https://cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి’’ అని SBI ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

SBI షేర్ చేసిన 6 భద్రతా చిట్కాలు ఇవే..

అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయడానికి ముందు యాప్ ప్రామాణికతను తనిఖీ చేయండి

అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు.

మీ డేటాను దొంగిలించగల అనధికార యాప్‌లను ఉపయోగించడం మానుకోండి.

మీ డేటా దొంగిలించకుండా చూసుకోవడానికి యాప్ అనుమతి సెట్టింగ్‌లను తనిఖీ చేయండి.

అనుమానాస్పద మనీ లెండింగ్ యాప్‌లపై స్థానిక పోలీసు అధికారులకు కంప్లైంట్ చేయండి.

మీ అన్ని ఆర్థిక లావాదేవీల అవసరాల కోసం https://bank.sbiని సందర్శించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..