DA Hike: ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు..!
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం..
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్ ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ చెల్లించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 34 శాతం కరువు భత్యం లభిస్తుంది. దీని వల్ల రాష్ట్రంలోని 7.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని, రాష్ట్ర ఖజానాపై రూ.625 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 31 శాతం కరువు భత్యం ఉండేదని ముఖ్యమంత్రి చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డియర్‌నెస్ అలవెన్స్‌ను 11 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్‌లో లభించే డియర్‌నెస్ అలవెన్స్‌ను ఆగస్టు నెల నుంచి వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పెన్షనర్లు కూడా కరువు భత్యం ప్రయోజనం పొందుతారు.
అయితే రానున్న కొద్ది రోజుల్లో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా 34 శాతం నుంచి 38 నుంచి 39 శాతానికి పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరువు భత్యం పెంపుపై మోదీ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పెంచిన డీఏ ఈనెల నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి