RBI: మూడు సహకార బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ సంచలన నిర్ణయం.. విత్‌డ్రాపై నిషేధం..!

RBI: బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ జరిమానతో పాటు పలు ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే ఎన్నో..

RBI: మూడు సహకార బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ సంచలన నిర్ణయం.. విత్‌డ్రాపై నిషేధం..!
Rbi
Follow us
Subhash Goud

|

Updated on: Jul 31, 2022 | 2:41 PM

RBI: బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ జరిమానతో పాటు పలు ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే ఎన్నో బ్యాంఉకలపై చర్యలు తీసుకున్న ఆర్బీఐ.. ఇప్పుడు మరో మూడు సహకార బ్యాంకులపై కఠినమైన చర్యలు చేపట్టింది. ఈ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నందున బ్యాంకు నుంచి డబ్బు విత్‌డ్రాపై నిషేధం విధించింది ఆర్బీఐ. సోలాపూర్‌ ది కర్మలా అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు, బాస్మత్‌నగర్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ నగరి కో ఆపరేటివ్‌ బ్యాంకు, విజయవాడలోని దుర్గ కోఆపరేటివ్‌ ఆర్బన్‌బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంకు చర్యలు తీసుకుంది. ఈ బ్యాంకుల నుంచి విత్‌ డ్రా చేసుకునేందుకు పరిమితిని నిర్ణయించింది. ఆర్బీఐ నిర్ణయించిన పరిమితికి ఎక్కువగా డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండదు.

వివిధ బ్యాంకుల్లో డబ్బు ఉపసంహరణలు వేర్వేరుగా నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించనందునే ఈ ఆంక్షలు విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు ది కర్మలా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఖాతాదారులు రూ. 10వేల వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వినియోగదారులు దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నుండి రూ. 1.5 లక్షల నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

కాగా, కస్టమర్లు డీఐసీజీసీ బీమా ప్రయోజనాన్ని పొందుతారు. డబ్బును బ్యాంకుల్లో సురక్షితంగా ఉంచడానికి రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఏదైనా కారణంగా బ్యాంకు దివాలా తీసిన సమయంలో, బ్యాంకు లైసెన్స్‌ రద్దు చేసినప్పుడు ఖాతాదారులకు రూ.5 లక్షల వరకు బీమా లభిస్తుంది. బ్యాంకు మూసివేసిన సమయంలో వినియోగదారులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి