Bullet Train Project: ముంబై – అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. పెరిగిన నిర్మాణ వ్యయం.. ఎంతంటే..!
Bullet Train Project: దేశంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రాజెక్టు పనులు చకచక జరుగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు..
Bullet Train Project: దేశంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రాజెక్టు పనులు చకచక జరుగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే దేశంలోని మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఇది. అయితే దీని అంచనా వ్యయం పెరిగింది. 2015 సంవత్సరంలో నిర్వహించిన సర్వే ప్రకారం.. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో మొదటి బుల్లెట్ రైలును నడపడానికి సుమారు రూ.1.08 లక్షల కోట్లు ఖర్చవుతాయి. ఈ అంచనా వ్యయం రూ.1.60 లక్షల కోట్లకు పెరిగింది. అయితే ఇందులో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని చేర్చలేదు. అవన్ని చేర్చితే మరింత వ్యయం పెరిగే అవకాశం ఉంది. గుజరాత్‌లోని సూరత్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును సమీక్షిస్తూ, జూన్‌లో మహారాష్ట్రలో భూసేకరణలో జాప్యం జరుగుతోందని, దీని వల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అన్నారు.
భూసేకరణ ఖర్చు అంచనా వ్యయం కంటే మించిపోయిందని, సిమెంట్, స్టీల్, ఇనుము మొదలైన నిర్మాణ సామగ్రి ధరలు కూడా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ బుల్లెట్ రైలు వ్యయం మరింతగా పెరిగిపోయింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ప్రాజెక్ట్ కోసం కొత్త ఖర్చు సమాచారం ఇంకా ఇవ్వలేమని తెలిపారు. భూసేకరణ పనులు, కాంట్రాక్టులు అన్నీ పూర్తయిన తర్వాతే ప్రకటన వెలువడనుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా హై-స్పీడ్ రైలు పనులు నెమ్మదించినట్లు తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి