Headache: ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి వేధిస్తోందా?.. పరిష్కార మార్గం మీకోసం..

Headache: చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పితో బాధపడుతుంటారు. ఈ సమస్యను చాలామంది సాధారణ సమస్యగా భావించి లైట్ తీసుకుంటారు.

Headache: ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి వేధిస్తోందా?.. పరిష్కార మార్గం మీకోసం..
Headache
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 31, 2022 | 2:56 PM

Headache: చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పితో బాధపడుతుంటారు. ఈ సమస్యను చాలామంది సాధారణ సమస్యగా భావించి లైట్ తీసుకుంటారు. కానీ, ఇది చాలా సీరియస్ విషయం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణం ఈ తలనొప్పి వెనుక అనేక కారణాలు ఉంటాయని చెబుతున్నారు. విపరీతమైన ఒత్తిడి, శరీరంలో నీరు లేకపోవడం, నిద్రలేమి వంటి సమస్యల వల్ల తలనొప్పి వస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇది తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉందంటున్నారు. ఉదయం నిద్ర లేవగానే వచ్చే తలనొప్పికి కారణమేంటి? ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి? అనే ప్రశ్నలకు ఇక్కడ పరిష్కార మార్గాలు చూద్దాం.

తలనొప్పికి కారణాలు: ప్రధానంగా శరీరంలో రక్త లేమి సమస్య కారణంగా ఈ తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో శరీరంలో ఆక్సిజన్ కొరత వల్ల కూడా ఈ తలనొప్పి సమస్యలు వస్తాయి.

చక్కెర స్థాయి: రక్తంలో చక్కెర స్థాయి అసాధారణంగా ఉంటే కూడా తలనొప్పి సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి మార్నింగ్ సిక్ నెస్ లక్షణం. ఉదయం లేవగానే తలనొప్పి విపరీతంగా ఉన్నట్లయితే.. షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

డీహైడ్రేషన్: సాధారణంగా చాలా మంది రాత్రిపూట, నిద్రవేళలో తక్కువ నీరు తాగుతారు. ఇలాంటి సమయంలో ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో నీరు లేకపోవడమే. ఉదయం నిద్ర లేవగానే సరిపడా నీళ్లు తాగకపోతే తలనొప్పి వస్తుంది.

నిద్రలేమి: నిద్ర లేకపోవడం వల్ల కూడా ఉదయం తలనొప్పి వస్తుంది. అదే సమయంలో చాలా మందికి ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది. నైట్ డ్యూటీ చేసేవారు తలనొప్పితో బాధపడే అవకాశం ఉంది.

ఉదయం తలనొప్పిగా ఉంటే ఇలా చేయండి.. ఉదయం నిద్ర లేవగానే చల్లటి నీళ్లకు బదులు.. గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే తలనొప్పి రాకుండా ఉంటుంది. తలనొప్పి తగ్గడానికి కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది. కంటికి సరిపడా నిద్ర, యోగా, మెడిటేషన్ వల్ల తలనొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు. ఏదైనా కారణం వల్ల తలనొప్పి తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..