Monsoon Tips: డెంగ్యూ సమయంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!
Monsoon Tips: వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఇది దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. దోమకాటు ద్వారా శరీరంలోకి..
Monsoon Tips: వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఇది దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. దోమకాటు ద్వారా శరీరంలోకి ప్రవేశించిన డెంగ్యూ వైరస్ శరీరం అంతా వ్యాపించి.. తీవ్రమవుతుంది ఇది నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.
డెంగ్యూ ప్రాథమిక లక్షణాలు.. ఎముకలు నొప్పి, కీళ్ళ నొప్పులు, కండరాల్లో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, తీవ్రమైన తల నొప్పి, కళ్ల వెనుక నొప్పి, ఆకస్మిక అధిక జ్వరం, విపరీతమైన అలసట, వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు, ఎరుపు మచ్చలు, ముక్కు లేదా చిగుళ్ళ నుండి తేలికపాటి రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి.
డెంగ్యూ లక్షణాలు కొన్నిసార్లు తేలికపాటి, వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలుగా భావించి లైట్ తీసుకుంటారు. అయితే, దీనిని నిర్లక్ష్యం చేస్తే.. తీవ్రమైన జ్వరం, రక్తనాళాలు దెబ్బతినడం, రక్తస్రావం, కాలేయం వాపు, రక్త ప్రసరణలో వైఫల్యం, మరణానికి దారితీయవచ్చు.
డెంగ్యూ ఎవరికి వస్తుంది.. డెంగ్యూ అనేది అన్ని వయసుల వారికి వస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారు త్వరగా డెంగ్యూ భారిన పడుతారు. డెంగ్యూ సోకిన వారిలో కొత్త ప్లేట్‌లెట్‌లను ఉత్పత్తి చేసే శరీర సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది. తద్వారా బాధితుల్లో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం ప్రారంభమవుతుంది. డెంగ్యూ తీవ్రమైతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. డెంగ్యూని గుర్తించడాపికి రక్త పరీక్ష చేయించాల్సి ఉంటుంది.
డెంగ్యూ వస్తే ఏం తినకూడదు.. 1. వేయించిన, అతిగా నూనె వాడిన ఆహార పదార్థాలు తినకూడదు. 2. స్పైసీ ఫుడ్, కెఫిన్ కలిగిన డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దు. 3. మాంసాహారం కూడా తినొద్దు.
బొప్పాయి ఆకుల రసాన్ని ఎప్పుడు తాగాలి.. బొప్పాయి ఆకుల రసాన్ని తాగమని అందరూ సూచిస్తుంటారు. కానీ, అది మరింత ప్రమాదానికి కారణం అవుతుంది. బొప్పాయి ఆకుల రసాన్ని వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇష్టారీతిన బొప్పాయి ఆకు రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తస్రావం అవుతుంది. అది సమస్యను మరింత తీవ్ర తరం చేస్తుంది. అలాగే, పైనాపిల్, వెదురు చిగురు వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఇవి కూడా రక్తస్రావాన్ని కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..