AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Seats: విమానంలో ఉండే సౌకర్యవంతమైన సీట్లు ఇక రైళ్లలో.. భారీ ఆర్డర్‌ అందుకున్న టాటా స్టీల్‌..!

Train Seats: రైళ్లలో విమానం లాంటి సౌకర్యవంతమైన సీటు ఏర్పాటు కానున్నాయి. దేశీయ స్టీల్ కంపెనీ టాటా స్టీల్ ఈ సీట్లను తయారు చేయనుంది. ముందుగా ఈ సీట్లను ముందుగా వందే..

Train Seats: విమానంలో ఉండే సౌకర్యవంతమైన సీట్లు ఇక రైళ్లలో.. భారీ ఆర్డర్‌ అందుకున్న టాటా స్టీల్‌..!
Trains
Subhash Goud
|

Updated on: Jul 31, 2022 | 8:28 PM

Share

Train Seats: రైళ్లలో విమానం లాంటి సౌకర్యవంతమైన సీటు ఏర్పాటు కానున్నాయి. దేశీయ స్టీల్ కంపెనీ టాటా స్టీల్ ఈ సీట్లను తయారు చేయనుంది. ముందుగా ఈ సీట్లను ముందుగా వందే భారత్‌ రైలులో అమర్చబోతున్నారు. సెప్టెంబర్ నుంచి ప్రత్యేక సీట్లను అమర్చడం కంపెనీ ప్రారంభించబోతోంది. దేశంలోనే ఈ తరహా సీటు విధానం ఇదే తొలిసారి. టాటా స్టీల్ వైస్ ప్రెసిడెంట్ దేబాశిష్ భట్టాచార్య ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని 22 రైళ్లకు సీట్లను అందించడానికి కంపెనీ కాంపోజిట్స్ విభాగానికి ఆర్డర్ వచ్చిందని తెలిపారు. ఈ ఆర్డర్ విలువ దాదాపు రూ.145 కోట్లు అని అన్నారు.

సీటు 180 డిగ్రీల కోణంలో..

ఇవి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన సీట్లు. ఈ సీటును 180 డిగ్రీల తిప్పుకునే సదుపాయం ఉంటుంది. విమానం సీట్లలాగానే ఉంటాయి. ఈ రకమైన రైలు సీటు భారతదేశంలోనే మొదటిది. ఈ సీట్ల సరఫరా సెప్టెంబర్‌ నుంచి ప్రారంభమై 12 నెలల్లో పూర్తవుతుంది. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, ప్రయాణికుల భద్రతను పెంపొందించడంలో కూడా దోహదపడుతుంది. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన వందే భారత్ రైలు గంటకు 130 కి.మీ వేగంతో వెళ్లగలదు. దేశంలోనే అత్యంత వేగవంతమైన రైళ్లలో ఇది ఒకటి.

ఇవి కూడా చదవండి

3,000 కోట్లు ఖర్చు చేసేందుకు సన్నాహాలు..

2025-26 నాటికి పూర్తి స్థాయిలో సీట్లను అమర్చనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం టాటా స్టీల్ రూ.3,000 కోట్లు వెచ్చించాలని యోచిస్తోందని భట్టాచార్య తెలిపారు. 2030 నాటికి టాటా స్టీల్‌ను ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 5 స్టీల్‌ కంపెనీల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంలో ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మహారాష్ట్రలోని ఖోపోలీలో శాండ్‌విచ్ ప్యానెళ్లను తయారు చేసేందుకు టాటా స్టీల్ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందని, దీనికి సాంకేతిక భాగస్వామిగా నెదర్లాండ్స్‌కు చెందిన కంపెనీ ఉందని ఆయన చెప్పారు. ఈ ప్లాంట్‌లో తయారైన శాండ్‌విచ్ ప్యానెళ్లను రైల్వే, మెట్రో కోచ్‌లలో ఇంటీరియర్స్ కోసం ఉపయోగిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..