Umaid Bhawan Palace: అద్భుతమైన కట్టడాలలో జోద్‌పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్.. దీని ప్రత్యేకత ఏమిటి?
Umaid Bhawan Palace: దేశంలో రకరకాల చారితాత్మక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కట్టడాలకు ఎంతో చరిత్ర ఉంటుంది. ఇక దేశంలోని రాజస్థాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అనేక కళలతో నిండిన రాజస్థాన్‌లో అందమైన..
Updated on: Jul 31, 2022 | 4:11 PM

Umaid Bhawan Palace: దేశంలో రకరకాల చారితాత్మక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కట్టడాలకు ఎంతో చరిత్ర ఉంటుంది. ఇక దేశంలోని రాజస్థాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అనేక కళలతో నిండిన రాజస్థాన్‌లో అందమైన రాజభవనాలు, గొప్ప కోటలు, కోటలతో సహా హవేలీలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్, రాజస్థాన్‌లోని అత్యంత ఖరీదైన, అందమైన రాజభవనాలలో ఒకటి. దేశం. ఉమైద్ భవన్ ప్యాలెస్‌ను మహారాజా ఉమైద్ సింగ్ జీ నిర్మించారు. ఈ భవనానికి 18 నవంబర్ 1929 నాడు పునాది వేయగా, 25 మే 1944లో నిర్మాణం పూర్తయ్యింది. ఈ ప్యాలెస్ నిర్మాణానికి అప్పట్లో రూ. 1,09,11,228 ఖర్చు అయ్యిందని నివేదికలు చెబుతున్నాయి.

జోధ్‌పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది.1920లో కరువు సంభవించడంతో జోధ్‌పూర్ వాసులు వరుసగా మూడు సంవత్సరాలపాటు ఇబ్బందులకు గురయ్యారు. కరువు కారణంగా ఈ రాచరికంలోని స్థానిక ప్రజలు అప్పటి రాజు ఉమైద్ సింగ్‌కు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేందుకు అప్పటి రాజు గొప్ప ప్యాలెస్‌ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.

అతను ప్రసిద్ధ వాస్తుశిల్పి హెన్రీ వాన్ లాంచెస్టర్‌ను పిలిచి ప్రణాళికను సిద్ధం చేసి అతనికి అప్పగించాడు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ నిర్మాణం 1929లో ప్రారంభమై 1943లో కరువు ముగిసిన తర్వాత ఈ ప్యాలెస్ 1944లో పూర్తయింది. ఈ ప్యాలెస్‌ని నిర్మించడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది.

ఈ ప్యాలెస్ పూర్తయిన తర్వాత ప్యాలెస్‌లో దాదాపు 347 పెద్ద గదులు, అనేక విశాలమైన ప్రాంగణాలు, ఒక పెద్ద డైనింగ్ హాల్ ఉన్నాయి. ఇందులో 300 మంది కంటే ఉండే విధంగా నిర్మించారు. ఈ ప్యాలెస్ లోపలి గోపురం లేత రంగులో ఉంటుంది. ఇది దాదాపు 31 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. దీని ఎత్తు 13 మీటర్లు ఉంటుంది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ప్యాలెస్ 1929 నుండి 1944 మధ్య కాలంలో జోధ్‌పూర్ ప్రసిద్ధ పాలకుడు మహారాజా ఉమైద్ సింగ్ చేత నిర్మించబడింది. ఈ ప్యాలెస్‌ను నిర్మించడానికి సుమారు 15 సంవత్సరాలు పట్టింది. స్థానిక ప్రజలకు ఉపాధి లభించేలా దీనిని నిర్మించారు. ఈ ప్యాలెస్ నిర్మాణం పనుల్లో స్థానిక ప్రజలు కూడా ఉన్నారు. దాదాపు 2,500 నుండి 3,000 మంది వరకు దీని నిర్మాణంలో నిమగ్నమయ్యారు.

ఈ ప్యాలెస్ భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్యాలెస్‌లలో ఒకటి. దీని నిర్మాణ వ్యయం సుమారు 11 మిలియన్స్. అప్పట్లో దీని ఖర్చు అధికమే. ఈ ప్యాలెస్ రెండో జోవాలు (రెక్కలు లాంటివి) నిర్మించారు. ఇవి బంగారు పుసు రంగు ఇసుక చత్తర్ రాతితో నిర్మించారు. ఇవి ప్యాలెస్ అందాన్ని మరింతగా పెంచుతుంది.

ఈ ప్యాలెస్ ప్రధానంగా 3 ఫంక్షనల్ భాగాలుగా విభజించబడింది. మొదటిది రాజకుటుంబ నివాసం, రెండవది తాజ్ ప్యాలెస్ హోటల్, మూడవది 20వ శతాబ్దపు పాలకుల వస్తువులను ప్రదర్శించడానికి ఉపయోగించే మ్యూజియం. ఈ ప్యాలెస్ భారతదేశంలోని అతిపెద్ద ప్యాలెస్‌లలో ఒకటి. ఇది సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇందులో థ్రోన్ రూమ్, ప్రైవేట్ మీటింగ్ హాల్, కోర్ట్ హాల్, బాంకెట్ హాల్, ప్రైవేట్ డైనింగ్ హాల్, బాల్ రూమ్, లైబ్రరీ, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మరిన్ని అద్భుతమైన కట్టాడాలు ఉన్నాయి. ఈ ప్యాలెస్‌ను తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహిస్తోంది. దీని కారణంగా దీనిని తాజ్ ఉమైద్ భవన్ ప్యాలెస్ జోధ్‌పూర్ అని కూడా పిలుస్తారు.





























