Beauty Tips: ఈ ఎసెన్షియల్ ఆయిల్స్‌ను పెర్ఫ్యూమ్స్ గా కూడా వాడుకోవచ్చు.. సువాసనతో పాటు మంచి అనుభూతి కూడా..
Beauty Tips: మార్కెట్‌లో పెర్ఫ్యూమ్‌లు చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే అవి చాలా ఖరీదైనవి. అదేవిధంగా వీటి సువాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఫలితంగా కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. ఈక్రమంలో కొన్ని నూనెలను పెర్ఫ్యూమ్‌లుగా వినియోగిస్తే బాగుంటుంది.
Updated on: Jul 31, 2022 | 1:52 PM

మార్కెట్‌లో పెర్ఫ్యూమ్‌లు చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే అవి చాలా ఖరీదైనవి. అదేవిధంగా వీటి సువాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఫలితంగా కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. ఈక్రమంలో కొన్ని నూనెలను పెర్ఫ్యూమ్‌లుగా వినియోగిస్తే బాగుంటుంది.

నెరోలి ఆయిల్: మార్కెట్‌లో నెరోలి పెర్ఫ్యూమ్స్ బాగానే దొరుకుతాయి. ఇది పువ్వుల సువాసనను కలిగి ఉంటుంది. పైగా ఇది మీకు మంచి అనుభూతిని ఇస్తుంది.

లావెండర్ ఆయిల్: చర్మం, జుట్టు సంరక్షణలో లావెండర్ ఆయిల్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీని సువాసన ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆందోళన సమస్యలను దూరం చేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

రోజ్ ఆయిల్ : ఈ ఆయిల్ పెర్ఫ్యూమ్ గా కూడా ఉపయోగించవచ్చు. ఈ సువాసన శక్తిని ఇవ్వడంతో పాటు మంచి అనుభూతిని కూడా అందిస్తుంది. దీన్ని రోజూ ఉపయోగించవచ్చు.

శాండల్‌వుడ్ ఆయిల్: బ్యూటీ ప్రొడక్ట్స్‌లో విరివిగా ఉపయోగించే శాండల్‌వుడ్ ఆయిల్ ఒకటి. ఇది సువాసనతో పాటు మనసుకు రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇది మార్కెట్లో విరివిగా లభిస్తుంది.





























