Business Idea: నష్టం లేని వ్యాపారం.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫుల్ డిమాండ్
ప్రస్తుతం మినరల్ వాటర్ తాగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే మినరల్ వాటర్ తాగే వారు. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ తాగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో వాటర్ ప్లాంట్ బిజినెస్‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఇంతకీ వాటర్ ప్లాంట్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.?
వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం చేసే వారు కూడా వ్యాపారం చేయాలని ఆశపడుతున్నారు. అయితే చాలా మంది లాభాలు రావని, పెట్టుబడి పెట్టడానికి వెనుకడుగు వేస్తూ వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉంటారు. అయితే తక్కువ పెట్టుబడితో లాభాలు పొందే బిజినెస్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం మినరల్ వాటర్ తాగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే మినరల్ వాటర్ తాగే వారు. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ తాగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో వాటర్ ప్లాంట్ బిజినెస్‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఇంతకీ వాటర్ ప్లాంట్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? ఇంత ఖర్చవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
ఇందుకోసం ముందుగా వాటర్ ప్యూరిఫికేషన్‌కు సంబంధించిన మిషన్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో మ్యాన్యువల్ మిషన్స్ కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాపారం పెరుగుతోన్న విధంగా ఆటోమెటిక్ మిషన్స్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక షెటర్, బోర్ ఉండాలి.అలాగే వాటర్ హోమ్ డెలివరీ చేయడానికి ఒక ఆటో, డెలివరీ బాయ్స్‌ను నియమించుకోవాలి.
ప్యూరిఫికేషన్ మిషన్‌తో పాటు వాటర్‌ను స్టోర్ చేసే ట్యాంకులను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే వాటర్ క్యాన్స్‌ను కొనుగోలు చేయాలి. ఇక లాభాల విషయానికొస్తే ఉదాహరణకు మీరు రోజుకు 200 క్యాన్స్ విక్రయించారనుకుందాం. ఒక్కో క్యాన్‌కు సుమారు రూ. 6 లాభం వస్తుంది. విద్యుత్ ఛార్జీలు, రూమ్ రెంట్ అన్ని కలుపుకున్నా. ఈ లెక్కన రోజుకు రూ. 1200 వరకు ఆర్జించవచ్చు. దీంతో నెలకు రూ. 36,000 వరకు సంపాదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..