Gold Price: హమ్మయ్య.! భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఏకంగా రూ. 2250 తగ్గి..
అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యే వరకు వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు అన్న అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం-వెండిలోకి పెట్టుబడులు తగ్గాయి. గరిష్ఠాన్ని తాకిన ధరలు, అంతే వేగంగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు .. అంటే 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర..
అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యే వరకు వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు అన్న అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం-వెండిలోకి పెట్టుబడులు తగ్గాయి. గరిష్ఠాన్ని తాకిన ధరలు, అంతే వేగంగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు .. అంటే 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర గురువారం 2340 డాలర్ల పలికింది. ఈ ధర గత సోమవారం 2423 డాలర్లుగా ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో గరిష్ఠంగా 2449 డాలర్లకు కూడా చేరింది.
అంతర్జాతీయంగా ధరలు దిగి వస్తున్నందున, మన దేశం మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు పతనమవుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో చూస్తే 10 గ్రాముల మేలిమి బంగారం ధర గురువారం రాత్రి 11 గంటల సమయానికి 74,400 రూపాయలు పలికింది. గత సోమవారం ఈ ధర 76,750 రూపాయలుగా ఉంది. అంటే 2250 రూపాయలు తగ్గింది. ఇటీవల గరిష్ఠ ధర 77,150 రూపాయలుగా ఉంది. అదే విధంగా వెండి కిలో ధర 92,000 రూపాయల స్థాయికి దిగి వచ్చింది. సోమవారం ఈ ధర 96,000 రూపాయల స్థాయిలో ఉంది. అంటే 4,000 రూపాయలు తగ్గింది. ఈక్విటీ మార్కెట్లలోకి మదుపర్ల నిధులు ఇలానే కొనసాగితే, బంగారం 10 గ్రాముల ధర రూ.73,000 స్థాయికి, వెండి కిలో రూ.86,000 స్థాయికి దిగి రావచ్చని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.