AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphones under 10k: పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం

నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ లేకపోతే నిమిషం కూడా గడపలేని పరిస్థితి. ప్రతి పనికీ అడుగడుగునా దీని అవసరం ఉంటుంది. జేబులో ఒక్క రూపాయి లేకపోయినా పర్వాలేదు గానీ ఫోన్ లేకపోతే బతకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్టార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసుకోవడం అత్యవసరమైంది.

Smartphones under 10k: పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
Smart Phones
Nikhil
| Edited By: TV9 Telugu|

Updated on: Sep 04, 2025 | 10:31 AM

Share

ప్రస్తుతం ఓ మాదిరి ఫోన్ కొనుగోలు చేయాలన్నా సుమారు రూ.20 వేల పైబడి డబ్బులు పెట్టాలని అందరూ భావిస్తున్నారు. అయితే అది నిజం కాదు. కేవలం రూ.పది వేలలోపు ధరలో ప్రముఖ బ్రాండ్లకు చెందిన 5 జీ ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

మోటో జీ35

మోటో జీ35 స్మార్ట్ ఫోన్ లో 6.72 అంగుళాల హెచ్ డీ, ఎల్ సీడీ డిస్ ప్లే, యునిస్కో టీ760 ప్రాసెసర్, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్కుల కోసం మాలి జీ57 ఎంసీ4 జీపీయూ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 18 డబ్ల్యూ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 50 ఎంపీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో డ్యూయల్ కెెమెరా సెటప్, సెల్పీల కోసం 16 ఎంపీ షూటర్ ఉన్నాయి. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మోస్ తో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, స్టిరియో స్పీకర్లు, ఐపీ 52 రేటింగ్ అదనపు ప్రత్యేకతలు.

ఇన్ఫినిక్స్ హాట్ 50

ఇన్ఫినిక్స్ హాట్ 50 స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల హెచ్ డీ, ఎల్ సీడీ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, గ్రాఫిక్స్ , ఇంటెన్సివ్ టాస్కుల కోసం మలి జీ57 ఎంసీ2 జీపీయూ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కెమెరా విషయానికి వస్తే 48 ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో కూడిన డెప్త్ సెన్సార్ బాగున్నాయి. సెల్పీలు, వీడియోల కోసం 8 జీబీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

పోకో సీ75

పోకో సీ75 స్మార్ట్ ఫోన్ లో 18 డబ్ల్యూ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 6.88 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, మీడియా టెక్ హేలియో జీ81 అల్ట్రా ప్రాసెసర్, ఏఆర్ఎం మలి జీ52 జీపీయూ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ ప్రైమరీ, సెకండరీ సెన్సార్, సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13 ఎంపీ షూటర్ ఏర్పాటు చేశారు.

వివో టీ3 లైట్

వివో టీ3 లైట్ స్మార్ట్ ఫోన్ లోని 6.56 అంగుళాల హెచ్ డీ, ఎల్ సీడీ డిస్ ప్లే ద్వారా విజువల్ స్పష్టంగా కనిపిస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్కుల కోసం మెయిల్ జీ57 ఎంసీ2 జీపీయూ, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. టీ3 లైట్ 5జీ ప్రైమరీ సెన్సార్, సెకండరీ 2 ఎంపీ డెప్త్ సెన్సార్, వెనుక డ్యూయల్ షూటర్ సెటప్, ముందు భాగంలో 8 ఎంపీ సెల్పీ కెమెరా ఏర్పాటు చేశారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం జాక్, దుమ్ము నీటి నుంచి రక్షణకు ఐపీ 64 రేటింగ్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి