AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Scam: బ్యాంకు బ్యాలెన్స్‌ చెకింగ్‌ కోసం పిన్‌ నమోదు చేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి.. లేకుంటే అకౌంట్‌ ఖాళీ!

Jumped deposit scam: UPIని ఉపయోగిస్తున్నప్పుడు, ఏదైనా తెలియని వ్యక్తి నుండి వచ్చే డబ్బు, అభ్యర్థనల గురించి జాగ్రత్తగా ఉండండి. మోసపూరిత లావాదేవీలను నివారించడానికి, ఎల్లప్పుడూ తెలివిగా వ్యవహరించండి. మీ పిన్‌ను గోప్యంగా ఉంచండి. ఇలాంటి సంఘటనలపై వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి..

UPI Scam: బ్యాంకు బ్యాలెన్స్‌ చెకింగ్‌ కోసం పిన్‌ నమోదు చేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి.. లేకుంటే అకౌంట్‌ ఖాళీ!
Subhash Goud
|

Updated on: Jan 11, 2025 | 10:27 AM

Share

ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ఎటు నుంచి ఎలాంటి మోసం వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. మొబైల్‌కు ఏదైనా మెసేజ్‌ వచ్చినా, రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో పాటు కొత్త కొత్త స్కామ్‌లు కూడా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా కేవైసీ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి.

యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంక్‌కి వెళ్లే పని తప్పింది. అందరూ ఇంట్లోనే ఉండి మొబైల్స్ ద్వారానే రకరకాల లావాదేవీలు చేస్తున్నారు. దీంతో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టడానికి ఎన్న జాగ్రత్తలు తీసుకుని, ఎంతగా అవగాహన పెంచుతున్నా.. సైబర్‌ మోసగాళ్లు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా జంప్డ్ డిపాజిట్ స్కామ్ (Jumped Deposit Scam) వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ స్కీమ్‌ ఎలా జరుగుతుందో చూద్దాం..

ఇది కూడా చదవండి: PM Modi: కష్టసుఖాల్లో మొదట కాల్‌ చేసేది ఎవరికో చెప్పిన మోదీ.. తొలి పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు

ఈ పద్ధతిలో సైబర్ దుండగులు ముందుగా యూపీఐ ద్వారా తమ బాధితుడి బ్యాంకు ఖాతాకు డబ్బు పంపుతారు. డబ్బు జమ అయినట్లు మెసేజ్ వచ్చిన వెంటనే చాలా మంది తమ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారని వారికి తెలుసు. డబ్బు అందుకున్న తర్వాత బాధితుడు తన బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి పిన్‌ను నమోదు చేసిన వెంటనే, అతని ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా అయిపోతుంది. అంటే పిన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన ఖాతాను దుండగులు యాక్సెస్‌ చేసేస్తారు. అంటే మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతుంది. మీ బ్యాంకు ఖాతా యాక్సెస్‌ వారి చేతిలోకి వెళ్లిన తర్వాత అకౌంట్లో ఉన్న డబ్బంతా వారి ఖాతాకు బదిలీ చేసుకుంటారు.

ఇలాంటి ఘటన తమిళనాడులో జరిగింది. ఈ స్కామ్‌పై అక్కడి పోలీసులు అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా, ఈ స్కామ్‌పై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కూడా చాలా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు యూపీఐ ద్వారా మీ ఖాతాకు డబ్బు పంపితే, మీరు జాగ్రత్తగా ఉండాలని తమిళనాడు పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి