Ashwini Vaishnav: వచ్చే రెండేళ్లలో 50 అమృత్ భారత్ రైళ్ల తయారీ: మంత్రి అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnav: భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పేద కుటుంబాలు తక్కువ ధరల్లో ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే రెండేళ్లలో 50 వరకు అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు..
వచ్చే రెండేళ్లలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో 50 అమృత్ భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం తెలిపారు. అమృత్‌భారత్ వెర్షన్ 2.0 రైళ్లలో కొత్తగా 12 రకాల మార్పులు చేపట్టినట్లు తెలిపారు. దీని నిర్మాణ సమయంలో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్నట్లు చెప్పారు.ఉంచుకుంటారు. ఈ మేరకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి శుక్రవారం కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. అమృత్ భారత్ రైళ్లతో పాటు, వందేభారత్ 2.0 స్లీపర్ రైళ్ల తయారీని పరిశీలించారు.
అలాగే తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. కేంద్రం, ఆయన మంత్రిత్వ శాఖ ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కాగా, అమృత్ భారత్ మొదటి ఎడిషన్‌ను 2024 జనవరిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. అమృత్ భారత్ రెండో ఎడిషన్ రైళ్లను ఇక్కడ తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని, గత ఒక సంవత్సరం అనుభవం ఆధారంగా, అమృత్ భారత్ రెండవ ఎడిషన్‌లో అనేక రకాల మార్పు చేర్పులు చేస్తున్నట్లు చెప్పారు.
సెమీ ఆటోమేటిక్ కప్లెట్స్, మాడ్యులర్ టాయిలెట్స్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ ఫీచర్, ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్, వందే భారత్ రైళ్ల తరహాలో నిరంతరం వెలిగే లైట్లు, ఛార్జింగ్ పోర్టులతో పాటు బెర్తుల డిజైన్ కూడా మార్చినట్లు వెల్లడించారు. ప్యాంట్రీ కారును సమూలంగా మార్చినట్లు తెలిపారు. అయితే తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అమృత్ భారత్ రైళ్లలో చేపడుతున్న మార్పుల గురించి ఎక్స్‌లో ఖాతాలో ఓ పోస్టు కూడా చేశారు మంత్రి.
రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి:
ఈ రైళ్ల నిర్మాణంలో తక్కువ ఆదాయం, దిగువ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్నట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. రాబోయే రెండేళ్లలో అమృత్ భారత్ రెండో ఎడిషన్‌కు చెందిన 50 రైళ్లను (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో) తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
🚆 Amrit Bharat Version 2.0: affordable and superior rail travel 🛤️
🧵A quick dive into the upgraded features👇 pic.twitter.com/EQ9CO2X1sL
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 10, 2025
ఇది కూడా చదవండి: PM Modi: కష్టసుఖాల్లో మొదట కాల్ చేసేది ఎవరికో చెప్పిన మోదీ.. తొలి పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి