Donald Trump Case: ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. దోషే కానీ..శిక్ష లేదు!
Donald Trump Hush Money Case: హష్ మనీ కేసులో ట్రంప్‌కు శిక్ష నుంచి బేషరతుగా మినహాయింపు ఇస్తున్నట్టు (అన్‌కండిషనల్ డిశ్చార్జ్) న్యూయార్క్ కోర్టు వెల్లడించింది. శుక్రవారం మన్‌హాటన్ జడ్జి జువాన్ ఎం.మర్చన్ తీర్పునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ దోషేనని ఆయన అన్నారు. అయినా ముందే ప్రకటించిన మేరకు ట్రంప్‌కు..
డొనాల్డ్ ట్రంప్ హుష్ మనీ కేసులో దోషిగా తేలింది. అయితే అతను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు లేదా జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జనవరి 20న ఆయన దేశ అత్యున్నత పదవిపై ప్రమాణం చేయనున్నారు. అయితే అతడికి శిక్ష పడకపోవడం ఊరటనిచ్చే అంశం. కోర్టు అతడిని ‘బేషరతుగా’ నిర్దోషిగా తేల్చింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ మౌనంగా ఉండేందుకు ఆమెకు 1,30,000 డాలర్లు చెల్లించినందుకు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలింది. అమెరికా అధ్యక్షుడికి శిక్ష పడడం ఇదే తొలిసారి. అయితే, ఇది తన ప్రత్యర్థుల కుట్రగా ట్రంప్ అభివర్ణిస్తున్నారు.
ఈ హష్ మనీ కేసులో ట్రంప్‌కు శిక్ష నుంచి బేషరతుగా మినహాయింపు ఇస్తున్నట్టు (అన్‌కండిషనల్ డిశ్చార్జ్) న్యూయార్క్ కోర్టు వెల్లడించింది. శుక్రవారం మన్‌హాటన్ జడ్జి జువాన్ ఎం.మర్చన్ తీర్పునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ దోషేనని ఆయన అన్నారు. అయినా ముందే ప్రకటించిన మేరకు ట్రంప్‌కు శిక్ష గానీ, జరిమానా గానీ విధంచడం లేదని స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్‌కు మొత్తం 34 కేసుల్లో ఎలాంటి పెనాల్టీ లేకుండా శిక్ష పడింది. ఎలాంటి పెనాల్టీ లేకుండా శిక్ష అంటే ఇన్‌కమింగ్ ప్రెసిడెంట్ జైలు సమయం, పరిశీలన లేదా మరేదైనా పెనాల్టీ నుండి తప్పించవచ్చు. ఒక కేసులో దోషిగా తేలిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేసే తొలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీని ప్రకారం ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయ కుట్ర అని ట్రంప్ అన్నారు.
ఇంతకీ కేసు ఏంటి?
పోర్న్ చిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌తో తన లైంగిక సంబంధాలపై మౌనంగా ఉంటూ 2016 అధ్యక్ష ఎన్నికల వేళ ప్రచార విరాళాల నుంచి ఆమెకు అక్రమంగా 1.3 లక్షలు డాలర్లు చెల్లించారని ట్రంప్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ట్రంప్‌పై 34 కేసులు నమోదు అయ్యాయి. వాటన్నింట్లోనూ ట్రంప్ దోషేనని ఆరు వారాల విచారణ అనంతరం 12 మంది జడ్జిల ధర్మాసనం గత మేలో తేల్చింది. అయితే ట్రంప్‌కు నవంబర్ నెలలో శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా, ట్రంప్ రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ఈనెల 20వ తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో క్రిమినల్ విచారణ నుంచి తనకు రక్షణ ఉంటుందని ట్రంప్‌వాదించారు. కానీ అలాంటిదేమీ ఉండబోదని న్యాయమూర్తి ఇటీవలే స్పష్టం చేయగా, జనవరి 10న శిక్ష విధిస్తా.. కాకపోతే బేషరతుగా వదిలేస్తూ నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. గురువారం రాత్రి హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోగా, తీర్పు ప్రక్రియను ఆలస్యం చేసేలా జడ్జిని ఆదేశించలేమంటూ న్యాయమూర్తులు 5–4 మెజారిటీతో తీర్పు వెలువరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి