Maruti alto video: కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు

సాధారణంగా ఎత్తయిన కొండల్లో, మంచు పర్వతాల్లో ప్రయాణించడానికి ఎక్కువ పవర్, కెపాసిటీ ఉన్న కార్లు బాగుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వాటితోనే చాాలా సులువుగా రాకపోకలు సాగించవచ్చు. అలాంటి ప్రాంతాలకు విహారయాత్రలు, పర్యటనల కోసం వెళ్లినప్పుడు పెద్ద కార్లనే అందరూ ఎంచుకుంటారు. అయితే ఇటీవల విడుదలైన ఓ వీడియో ఆ ఆలోచనను పటాపంచలు చేసింది.

Maruti alto video: కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
Alto
Follow us
Srinu

|

Updated on: Jan 11, 2025 | 3:45 PM

మంచు నిండిన ఎత్తయిన రహదారిపై ప్రయాణానికి పెద్ద కార్లు ఇబ్బంది పడుతుండగా, మారుతీ ఆల్టో సునాయాసంగా ఎక్కేసింది. ఇన్ స్టాగ్రామ్ లో సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియో వైరల్ గా మారింది. మారుతీ సుజుకిీ కంపెనీ మన దేశంలో ఆల్టో 800ని నిలిపివేసినా, ఇప్పటికీ దీనికి ప్రజల ఆదరణ తగ్గలేదు. దీనికి ఆ వీడియో నిదర్శనంగా నిలిచింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్ లోని మంచుతో కప్పబడిన ఎత్తయిన రహదారిపైకి ఎక్కడానికి మహీంద్రా థార్, మారుతీ సుజుకీ జిమ్నీ, మారుతీ సుజుకీ జిప్సీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. కొంత దూరం ఎక్కి వెనక్కు జారిపోతున్నాయి. కారును డ్రైవర్ ఎంత నియంత్రించినా ఫలితం ఉండడం లేదు. కానీ మారుతీ ఆల్టో మాత్రం ఆ రహదారిని సునాయాసంగా ఎక్కేసింది. ఎక్కడా ఇబ్బంది పడకుండా డ్రైవర్ చాలా సులువుగా పైకి ఎక్కించేశాడు. సాధారణ రహదారిపై వెళ్లిన విధంగానే చాలా సులువుగా ఆ కారును నడిపాడు.

దేశంలోని చాలా మందికి ఈ వీడియో బాగా నచ్చింది. చిన్న కారైనా భలే దూసుకుపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చిన్న కార్ల నాణ్యత, డ్రైవర్ నైపుణ్యానికి ఇది నిదర్శమని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మారుతీ సుజుకీ ఆల్టో వాహనం క్లిప్ మాత్రం అందరికీ నచ్చేసింది. సాధారణంగా ఈ కారు పట్టణ ప్రయాణాలకు చాలా వీలుగా ఉంటుంది. ఎత్తయిన కొండల్లో ప్రయాణించాలంటే ఇబ్బంది పడాలని డైవర్లు భావిస్తారు. కానీ హిమాచల్ ప్రదేశ్ లో మంచు పర్వతం పైకి చాలా సునాయాసంగా ఎక్కేసింది. టైర్ చైన్లు, అవగాహన కలిగిన డ్రైవర్ తదితర విషయాలు కూడా ఈ విజయంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కొత్త హై ఎండ్ ఆఫ్ రోడింగ్ టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్లలో కూడిన వివిధ ఎస్ యూవీ కార్లు నేడు మార్కెట్ లో లభిస్తున్నాయి. వాటి సామర్థ్యం, పనితీరు అద్భుతంగా ఉంటుంది. అయినా చిన్నపాటి మారుతీ ఆల్టో కారును ఇప్పటికీ కొండలు, ఎత్తయిన ప్రాంతాల్లో వాడుతున్నారు. ఆల్టో కారుకు తేలికపాటి ఫ్రేమ్ ఉండడం, ముందు టైర్లకు చైన్లను అమర్చడం, డ్రైవర్ నైపుణ్యం కారణంగా వీడియో సునాయాసంగా కొండపైకి ఎక్కేసింది. కొండల్లో, ముఖ్యంగా జారుతున్న మంచుతో నిండిన రోడ్లపై ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సాంకేతిక కలిగిన హై ఎండ్ ఎస్ యూవీలు విఫలం కావచ్చు. వాటిపై తేలికపాటి వాహనాలు మాత్రం సునాయాసంగా ప్రయాణం చేస్తాయి. దీనికి తోడు డ్రైవర్ నైపుణ్యం చాలా కీలకంగా ఉంటుంది. ఆల్టో అత్యంత తేలికైన కారు కావడం దీనికి కలసివచ్చిన అంశం. ఏది ఏమైనా ఈ వీడియో 2.38 లక్షల లైక్ లను సంపాదించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి