Petrol Price: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.55కే లీటర్ పెట్రోల్‌, డీజిల్‌.. వారికి మాత్రమే!

Petrol Price: ప్రస్తుతం పెట్రోల్‌ ధర లీటర్‌కు వంద రూపాయలకుపైగా ఉంది. అదే డీజిల్‌ ధర వంద లోపు ఉంది. పెట్రోల్,డీజిల్‌ ధరలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ ఆ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.55లకే పెట్రోల్‌, డీజిల్‌ అందిస్తోంది. ఇది అందరి కాదు.. కొందరికి మాత్రమే..

Petrol Price: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.55కే లీటర్ పెట్రోల్‌, డీజిల్‌.. వారికి మాత్రమే!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 11, 2025 | 12:53 PM

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వంద రూపాయల వరకు ఉంది. గతంలో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించినప్పటీకీ.. ఇంకా భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వాహనదారుల మతి పోగొట్టే ప్రకటన చేసింది. ఈ ప్రకటన వల్ల ఎంతో మందికి ఉపశమనం కలుగనుంది. ఇంతకీ ఈ ప్రకటన ఏంటనేగా మీ అనుమానం. చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ అందించేందుకు సిద్ధమైంది. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ కేవలం రూ.55లకే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రటకనను చూసి వాహనదారులు ఎగిరి గంతేస్తారు. కానీ ఈ సబ్సిడీ అందరి అనుకుంటే పొరపాటే. కొందరికి మాత్రమే. మరి ఈ కొందరు ఎవరు..? ఈ ప్రయోజనం కేవలం దివ్యాంగులకు మాత్రమే. వీళ్లకు తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ వస్తుంది. మరి ఇంత తక్కువ ధరకు పెట్రోల్‌, డీజిల్‌ పొందాలంటే ఏం చేయాలో చూద్దాం..

ఆయా జిల్లాలో దివ్యాంగులు రాయితీపై పెట్రోల్, డీజిల్ పొందొచ్చు. స్వయం ఉపాధి పొందుతూ ఉన్నా లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటన్నా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇందుకు సంబంధించి సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాయితీపై దివ్యాంగులు పెట్రోల్, డీజిల్ పొందాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడు చక్రాల మోటారైజ్డ్ వాహనం కలిగిన దివ్యాంగులు ఈ ప్రయోజనం పొందవచ్చు.పెట్రోల్, డీజిల్‌ ధరలపై 50 శాతం రాయితీ లభిస్తుంది. ఈ స‌బ్సిడీ ప‌థ‌కం అమ‌లు కోసం రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాల్లో రూ.26 ల‌క్షల‌ను కేటాయించినట్లు తెలుస్తోంది.

రాయితీ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ:

ఇదిలా ఉంటే సర్కార్‌ ఈ రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ రాయితీపై కూడా పరిమితి ఉంటుంది. 2 హెచ్‌పీ వాహనం అయితే నెలకు 15 లీటర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన వాహనం అయితే నెలకు 25 లీటర్ల వరకు రాయితీపై పొందేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బిల్లులు తప్పనిసరి..

మరి ఈ రాయితీ బెనిఫిట్‌ పొందాలంటే వారు వేసుకున్న పెట్రోల్‌,డీజిల్‌కు సంబంధించిన బిల్లులు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సబ్సిడీ డబ్బులు సదురు దివ్యాంగుల బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుంది ప్రభుత్వం. వీరు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల వారు జిల్లాల్లోని విక‌లాంగుల సంక్షేమ కార్యాల‌యాన్ని సంద‌ర్శించి, అద‌న‌పు సమాచారాన్ని తెలుసుకుని ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

అవ‌స‌ర‌మైన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

1. విక‌లాంగు సర్టిఫికేట్‌

2. వెహిక‌ల్ రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలు

3. బ్యాంక్ అకౌంట్ బుక్ మొద‌టి పేజీ

4. ద‌ర‌ఖాస్తు ఫారం (పూర్తి చేసి ఉండాలి)

5. తెల్ల రేష‌న్ కార్డు

6. డ్రైవింగ్ లైసెన్స్‌

7. పెట్రోల్ కొనుగోలు చేసే బిల్లులు

8. ఆధార్ కార్డు

9. ప్రైవేటు సంస్థలో ప‌ని చేస్తున్న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

10. ఒక పాస్ పోర్టు సైజ్ ఫోటో

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి