- Telugu News Photo Gallery Performing Bhogi festival with 1 Lakhs Cow dung cakes In East Godavari District
లక్ష పిడకలతో ‘భోగి’ ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు.. ఎక్కడో తెలుసా..?
సంక్రాంతి పండగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది భోగి. అయితే, సంక్రాంతి, భోగీ పండగంటే ఏపీలో నెల రోజుల ముందు నుంచి హడావుడి మొదలవుతుంది. ధనుర్మాసం ప్రారంభించిన తరువాత భోగి రోజున వెలిగించే మంటల్లో పిడకలు వేయడం సాంప్రదాయం. అయితే, ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని విడవకుండా కొనసాగిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. సంక్రాంతి నేలగంట పట్టినప్పుడు నుండి వాళ్ళ ఇళ్లలో ఉన్నా గోవులకు పసుపు కుంకుమ తో శుద్ధి చేసి ప్రత్యేక శ్రద్ధతో ఆవు మూత్రం, పెడను సేకరించి లక్షకు పైగా పిడకలను తయారు చేశారు.
Pvv Satyanarayana | Edited By: Jyothi Gadda
Updated on: Jan 11, 2025 | 1:23 PM

సంక్రాంతి అనగానే గుర్తుచేది..పల్లెటూరు తెలుగు లోగిల్లు..సాంప్రదాయ దుస్తులతో ఆడపడుచులతో...కొత్త అల్లుళ్లతో మూడు రోజుల సందడి.. బోగి మంటలు కోసం తెల్లవారుజామునే పెద్ద పెద్ద దుంగలతో ఏర్పాటు చేసే మంటలు.. ఆ మంటల్లో కాచుకున్న నీటితో తల స్నానాలు చేయడం అనవాయితీ..రాను రాను సంక్రాంతి ముందుగా వచ్చే భోగి పండుగకు భోగి మంటలు వేసి అలవాటును మరిచిపోతున్నారు. అయితే ఓ గ్రామంలో పిడకల సంప్రదాయంతో బోగి మంటలను వేస్తూ తెలుగు సంప్రదాయం ను గుర్తు చేస్తున్నారు గ్రామ మహిళలు..ఇంటి నుండి ఒక్క పిడక అయినా లేకుండా ఆ ఊరిలో బోగి మంటలు ఉండవు.. ఇంతకి ఎక్కడ ఈ గ్రామం అని చూస్తున్నారా!!..అయితే, పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..

తూర్పుగోదావరి జిల్లా,సీతానగరం మండలం,రాపాక గ్రామంలో మహిళలు పిడకలతో బోగి మంటలకు శ్రీకారం చుడుతున్నారు.. గ్రామ పూర్వికుల ఆచార సంప్రదాయం ప్రకారం ఇంటి నుండి కనీసం ఒక పిడకైనా ప్రతి ఏటా బోగి మంటకు సొంతంగా తయారు చేసుకుని వేయాలి..ప్రతి ఏటా బోగి సమయానికి గ్రామంలో ప్రతి ఒక్కరు 116 నుండి 1116 వరకు ప్రతి ఒక్కరు బోగి మంటల్లో పిడకలు వేయడం వారి సాంప్రదాయం గా మలుచుకున్నారు..

ఇలా గ్రామంలో అలవాటుగా మారిన ఈ సాంప్రదాయం కోసం వివాహం అయినా ఆడపడుచులు కూడా ఏప్రాంతంలో ఉన్నా సంక్రాంతి వచ్చే సమయంలో నెల ముందే ఈ గ్రామానికి కుటుంబ సమెతంగా చేరుకుంటారు. సంక్రాంతి నేలగంట పట్టినప్పటి నుండి వాళ్ళ ఇళ్లలో ఉన్నా గోవులకు పసుపు కుంకుమ తో శుద్ధి చేసి ప్రత్యేక శ్రద్ధతో ఆవు మూత్రం ను, పెడను సేకరించి పిడకలను తయారు చేస్తారు..అప్పటి నుండి తయారు చేసిన పిడకలను వాళ్లకు అనువుగా ఉన్నా చోట ఎండబెట్టి దండలుగా తయారు చేస్తారు.

అయితే గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోగి సమయంలో మంటల్లో కనీసం ఒక్క పిడక అయినా ఇంటి నుండి వేయడం సంప్రదాయం గా ఉన్నా ఈ గ్రామంలో లక్ష్మి అనే మహిళా గత పదకొండేళ్లుగా లక్ష పిడకలతో బోగి మంటకు సిద్దమయ్యారు. ప్రతి ఏటా నెల గంట పెట్టినప్పుడు నుండి పెడను సేకరించి నెల రోజుల వ్యవధిలో లక్ష పిడకలను తయారు చేసి బోగి మంటల్లో సాంప్రదాయ దుస్తులు తో మంటలను వేసానని ఆమె తెలిపారు..

ప్రతి ఏటా వేసే లక్ష పిడకలు బదులు ఈఏడాది మాత్రం లక్ష నూట పదహారు వరకు పిడకలను బోగి మంటకు సిద్ధం చేశామని, ఈ మహోత్తర కార్యక్రమ వల్ల పాడి పంటలు, అభివృద్ధి చెందుతాయని, లక్ష పిడకలు వేయడం తో లక్ష్మి కాంతులతో లక్కు కోసం ప్రతి సంక్రాంతి కి ఎదురు చూస్తున్నానంటూ రామలక్ష్మి అనే మహిళా చెబుతున్నారు... మరో పక్క ఇతర రాష్ట్రాల నుండి ఈ గ్రామంలో సంక్రాంతి కు ఈ బోగి రోజున వేసే పిడకల సాంప్రదాయం లో పెద్ద ఎత్తున పాల్గొనీ తాము కూడా బోగి మంటల్లో పిడకలు వేయడం చాలా సంతోషం గా ఉందని చెబుతున్నారు స్థానికులు..





























