ఒకప్పుడు అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఇటలీ, జర్మన్ బైక్స్ కొనాలంటే వేరే రాష్ట్రాల వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏపీలో ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు ఏపీలో ప్రస్తుతం బెనిలీ, ట్రైంప్, రీగల్ రేప్టర్,యూఎస్ కమాండో,హార్లీ డేవిడ్ సన్, కవాసకి, కేటిఎం, బియండబ్లు, వంటి అదునాతన బైక్స్ అందుబాటులో వున్నాయి. అయితే ఈ ఫారిన్ బైక్స్ కోనడంతో పాటు వీరంతా వీక్ ఎండ్ లో ఏపీలోని రైడ్స్ కు వెళుతూ తమధైన శైలీలో ఎంజాయ్ చేస్తోన్నారు. దీంతో పాటు ఆయా వాహన వినియోగదారులు అందరూ కలిసి స్షెషల్ డేస్ లో బైక్ షోలు నిర్వహించి వచ్చిన నిధులతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.