- Telugu News Photo Gallery Control belly fat simply with mint leaves, Check Here is Details in Telugu
Pudina for Belly Fat: పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
పుదీనా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వంటల్లో పుదీనాను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పుదీనాతో అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పుదీనాను ఇలా వాడితే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది..
Updated on: Jan 11, 2025 | 1:17 PM

పుదీనా ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. పుదీనా ఆకుల్ని కేవలం పులావ్, బిర్యానీ, మసాలా వంటల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ పుదీనాతో ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. పుదీనాతో బెల్లీ ఫ్యాట్‌ని కూడా కంట్రోల్ చేయవచ్చు.

పుదీనా వాసన చూస్తేనే ఎంతో రీ ఫ్రెషింగ్‌గా ఉంటుంది. పుదీనా నమలడం వల్ల కూడా నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. పుదీనాతో పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వును కూడా కరిగించవచ్చు. కొవ్వును కరిగించడంలో పుదీనా ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.

ప్రతి రోజూ ఉదయం పుదీనా ఆకులు నమిలి తినాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీరు తాగితే బెల్లీ ఫ్యాట్ అనేది కరుగుతుంది. అలాగే పుదీనా వేసి మరిగించిన నీటిని రోజంతా తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.

బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు.. పుదీనా చట్నీ వంటి ఆహారాలు తరచూ తింటే ఇది పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది.

పుదీనా ఆకులు మరిగించిన నీటిని భోజనం చేసిన ఓ గంట తర్వాత తాగినా, సలాడ్, స్మూతీలో చేర్చి తిన్నా మంచి ఫలితం ఉంటుందట. పరగడుపున పుదీనా ఆకుల్ని నమిలి తిన్నా కేవలం బెల్లీ ఫ్యాట్ మాత్రమే కాకుండా.. చర్మ, జుట్టు ఆరోగ్యం పెరుగుతుంది. ఇతర లాభాలు కూడా చాలానే ఉన్నాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




