- Telugu News Photo Gallery Do this to get relief from body pains in winter, Check Here is Details in Telugu
Body Pains in Winter: శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..
వింటర్ సీజన్ వచ్చిదంటే శరీరంలో నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. వీటి కారణంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పడుకున్నా.. కూర్చున్నా ఈ నొప్పులు వస్తాయి. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగని కారణంగా ఈ సమస్యలు వస్తాయి. ఇలా చేస్తే నొప్పులు రాకుండా ఉంటాయి..
Updated on: Jan 11, 2025 | 12:57 PM

శీతా కాలం వచ్చిందంటే శరీర నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ ఇంట్లో పెద్ద వాళ్లు ఉన్నారంటే మోకాళ్ల నొప్పులు మరింతగా వస్తాయి. చలి కారణంగా కండరాలు, కీళ్లు పట్టేస్తాయి. దీంతో ఎలాంటి పని చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది.

వాతావరణంలో వేడి తగ్గడం కారణంగా శరీరంలో సిరలు కుంచించుకు పోతాయి. దీంతో రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది. దీని వల్ల కండరాలు, కీళ్లు పట్టేసి.. నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ నొప్పులు రాకుండా ఉండాలంటే శారీరక శ్రమ అనేది చాలా అవసరం.

అంతే కాకుండా విటమిన్ డి లోపం కారణంగా కూడా మోకాళ్ల నొప్పులు అనేవి వస్తాయి. ఎందుకంటే వింటర్ సీజన్‌లో ఎండ అనేది చాలా తక్కువగా తగులుతుంది. దీని వల్ల కూడా శరీర నొప్పులు, మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి.

ఈ నొప్పులు రాకుండా ఉండాలంటే.. శరీరం వెచ్చగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే ఉన్ని దుస్తులు, హీటింగ్ ప్యాడ్స్ వాడాలి. శరీరాన్ని వేడి నూనెతో మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరిగి.. నొప్పులు రాకుండా ఉంటాయి.

నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని తీసుకున్నా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. విటమిన్ డి ఉండే ఆహారాలు కూడా తినాలి. యోగా వంటివి చేయడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ చురుకుగా జరుగుతుంది.




