Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unclaimed Deposits: బ్యాంకుల్లో రూ.78,213 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు.. ఏప్రిల్‌ 1 నుంచి ఆర్బీఐ కొత్త వ్యవస్థ!

Unclaimed Deposits: మార్చి 2024 వరకు ఉన్న డేటా ప్రకారం.. ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ ఫండ్ (DEA)లో రూ.78,213 కోట్లు జమ అయ్యాయి. ఈ మొత్తం గత సంవత్సరం కంటే 26 శాతం ఎక్కువ. నిలిచిపోయిన ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు,.

Unclaimed Deposits: బ్యాంకుల్లో రూ.78,213 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు.. ఏప్రిల్‌ 1 నుంచి ఆర్బీఐ కొత్త వ్యవస్థ!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 26, 2025 | 8:29 PM

భారతీయ బ్యాంకుల్లో రూ.78,213 కోట్లకుపైగా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. అంటే ఈ అకౌంట్ల ఎవరివో తెలియనివి. ఒక విధంగా చెప్పాలంటే బ్యాంకులో డబ్బు జమ చేసి, దానిని విత్‌డ్రా చేసుకోలేక అలాగే ఉండిపోయింది. ఆ ఖాతాలకు ఎలాంటి వారసులు లేరు. అందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆ డబ్బును అన్‌క్లైయిమ్డ్‌ డిపాజిట్లుగా ఉండిపోయాయి. ఇప్పుడు ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ దాని నిజమైన యజమానులకు మాత్రమే చెందుతుంది. ఈ డబ్బును తిరిగి పొందడానికి ఆర్బీఐ ఏప్రిల్ 1, 2025 నుండి కొత్త వ్యవస్థను అమలు చేస్తోంది. దీని కింద, బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పూర్తి వివరాలను ఉంచాలి. ఇందులో ఖాతాదారుడి పేరు, పబ్లిక్ సెర్చ్ ఫీచర్ కూడా ఉంటాయి.

ఇది కూడా చదవండి: Train Ticket Transfer: కన్ఫర్మ్‌ అయిన రైలు టికెట్‌ను వేరొకరికి ఎలా బదిలీ చేయాలి?

కొత్త ప్రక్రియ ఏమిటి?

ఇవి కూడా చదవండి

ప్రామాణిక ఫార్మాట్: ఇప్పుడు అన్ని బ్యాంకులు ఒకే రకమైన దరఖాస్తు ఫారమ్, పత్రాలను అడుగుతాయి.

ఆన్‌లైన్ సౌకర్యం: FY2026 నాటికి పూర్తిగా ఆన్‌లైన్ క్లెయిమ్ వ్యవస్థ ప్రారంభించబడుతుంది. సులభమైన ధృవీకరణ: ఫారమ్ నింపిన తర్వాత, బ్యాంక్ శాఖ స్వయంగా కస్టమర్‌ను సంప్రదించి డబ్బును బదిలీ చేస్తుంది.

మీ నిష్క్రియ ఖాతాను ఎలా తనిఖీ చేయాలి?

ఇప్పటివరకు క్లెయిమ్ చేయని డిపాజిట్లను తనిఖీ చేయడానికి కస్టమర్లు RBI UDGAM పోర్టల్‌కు వెళ్లి, ఆపై వాటిని క్లెయిమ్ చేయడానికి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చేది. కొత్త వ్యవస్థలో ఈ ప్రక్రియ సులభతరం అవుతుంది.

క్లెయిమ్ చేయని డిపాజిట్ ఎంత?

మార్చి 2024 వరకు ఉన్న డేటా ప్రకారం.. ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ ఫండ్ (DEA)లో రూ.78,213 కోట్లు జమ అయ్యాయి. ఈ మొత్తం గత సంవత్సరం కంటే 26 శాతం ఎక్కువ. నిలిచిపోయిన ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్‌లు, బీమా కంపెనీలను ఆదేశించారు.

కొత్త నామినీ నియమం కూడా వర్తిస్తుంది

బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024 ప్రకారం.. ఇప్పుడు ఒక ఖాతాలో 4 మంది నామినీలను కలిగి ఉండవచ్చు (గతంలో 1 మాత్రమే ఉండేది). దీనివల్ల నిష్క్రియాత్మక ఖాతాల నుండి డబ్బును తిరిగి పొందడం సులభం అవుతుంది.

మీ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌ను ఎలా కనుగొనాలి?

  • బ్యాంక్ వెబ్‌సైట్‌లో “అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు” విభాగాన్ని తనిఖీ చేయండి.
  • పేరు, మొబైల్ నంబర్, చిరునామాతో ఫారమ్ నింపండి.
  • బ్యాంక్ ధృవీకరించి మీ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంది.

ఇది కూడా చదవండి: April School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌లో ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి