AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Schemes: ఆ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడితో రాబడి వరదే.. రూ.2 లక్షల డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ ఎంతంటే?

భారతదేశంలోని ప్రజలు ఏళ్లు పోస్టాఫీసుల ద్వారా వివిధ సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రత్యుత్తరాలకే కాకుండా వివిధ పొదుపు పథకాల ద్వారా పోస్టల్ శాఖ తన సేవలను అందిస్తుంది. పోస్టాఫీసుల్లో చాలా పొదుపు పథకాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందడంతో వాటికి తగ్గట్టు పోటీలో ఉండేందుకు పోస్టాఫీసు కూడా వివిధ పొదుపు పథకాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసు పథకాల్లో అధిక వడ్డీనిచ్చే పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Post Office Schemes: ఆ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడితో రాబడి వరదే.. రూ.2 లక్షల డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ ఎంతంటే?
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కొత్త నెలవారీ ఆదాయ పథకం (MIS) 2025ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మీరు ప్రతి నెలా హామీతో కూడిన రాబడిని పొందుతారు. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో మీరు ఒకేసారి ఒక మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దానిపై మీకు 7.5% వడ్డీ లభిస్తుంది. దీనివల్ల మీకు ప్రతి నెలా మంచి ఆదాయం లభిస్తుంది. మీ రోజువారీ ఖర్చులు సులభంగా తీర్చుకోవచ్చు
Nikhil
|

Updated on: Mar 26, 2025 | 8:11 PM

Share

పోస్ట్ ఆఫీస్ తన కస్టమర్లకు అన్ని బ్యాంకింగ్ సేవలతో పాటు పోస్టల్ సేవలను అందిస్తుంది. పోస్టాఫీసులో పెట్టుబడి పథకాలతో పాటు పొదుపు ఖాతా, రికరింగ్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి పొదుపు పథకాల్లో కూడా ఖాతాను తెరవవచ్చు. పోస్టాఫీసులో పొదుపు పథకాల కింద ఖాతా తెరవడం ద్వారా మీరు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని పొందడమే కాకుండా మీ డబ్బును కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పోస్టాఫీసుకు సంబంధించిన ఓ పథకంలో మీరు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయడం చేస్తే రెండళ్లకు రూ. 29,776 స్థిర వడ్డీని పొందవచ్చు. 

దేశంలోని అన్ని బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలను తెరిచినట్లే, పోస్టాఫీస్ కూడా తమ కస్టమర్ల కోసం టైమ్ డిపాజిట్ (టీడీ) ఖాతాలను తెరుస్తుంది. పోస్టాఫీస్‌కు సంబంధించిన టీడీ సరిగ్గా బ్యాంకుల ఎఫ్‌డీ ఖాతా లాంటిది. పోస్టాఫీస్ తన కస్టమర్లకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలానికి టీడీ ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే పోస్టాఫీస్ టీడీ ఖాతాలపై 6.9 శాతం నుండి 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీసులో 2 సంవత్సరాల టీడీపై 7.0 శాతం వడ్డీని ఇస్తున్నారు. టీడీ ద్వారా మీరు రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 2,29,776 లభిస్తుంది.

దేశంలోని ఏ పౌరుడైనా పోస్టాఫీసులోని టీడీ పథకంలో ఖాతాను తెరవవచ్చు. మీరు టీడీ ఖాతాలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు, అయితే దానిలో గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. కస్టమర్ తనకు కావాల్సినంత డబ్బును డిపాజిట్ చేయవచ్చు. పోస్టాఫీసులో 2 సంవత్సరాల టీడీ రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 2,29,776 లభిస్తుంది, ఇందులో రూ. 29,776 నికర, స్థిర వడ్డీ వస్తుంది. మీరు టీడీ ఖాతాను తెరిచిన వెంటనే, మెచ్యూరిటీ సమయంలో మీకు ఎంత డబ్బు వస్తుందో మీకు తెలుస్తుంది. పోస్టాఫీసులో టీడీ ఖాతాను తెరవడానికి ఆ పోస్టాఫీసులోనే పొదుపు ఖాతా ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా..
ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా..
పాక్ సూపర్ లీగ్‌కు ఉగ్ర ముప్పు..జారుకుంటున్న విదేశీ ప్లేయర్లు
పాక్ సూపర్ లీగ్‌కు ఉగ్ర ముప్పు..జారుకుంటున్న విదేశీ ప్లేయర్లు
కొండచిలువ రక్తంతో మనుషుల బరువు తగ్గి, గుండె పదిలంగా ఉంటుందట..!
కొండచిలువ రక్తంతో మనుషుల బరువు తగ్గి, గుండె పదిలంగా ఉంటుందట..!
పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం అప్డేట్
పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం అప్డేట్
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?
ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?
జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్
జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్
త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా
త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా