Train Ticket Transfer: కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌ను వేరొకరికి ఎలా బదిలీ చేయాలి?
Train Ticket Transfer: టిక్కెట్లను బదిలీ చేయడం సులభం అవుతుంది. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడానికి రైల్వే నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. రైల్వే నిబంధనల ప్రకారం.. టికెట్ బదిలీ అనేది ఒక అవాంతరం లేని ప్రక్రియ కావచ్చు. కానీ మీరు ముందుగానే సిద్ధం చేసుకుని నియమాలను పాటిస్తేనే ఈ సౌకర్యాన్ని పొందవచ్చు..

ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో మన భారత రైల్వే నాలుగో స్థానంలో ఉంది. దేశంలో మొదటి స్థానంలో ఉంది. అయితే ప్రయాణికుల కోసం రైల్వే ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైల్వే టికెట్ల విషయంలో మరింత సులభతరం చేస్తోంది. అయితే మీరు రైలు టికెట్ బుక్ చేసుకుని ఏదైనా కారణం చేత ప్రయాణించలేకపోతే, మీరు మీ కన్ఫర్మ్ టికెట్‌ను దగ్గరి బంధువుకు బదిలీ చేయవచ్చు. ఈ వ్యవస్థ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ భారతీయ రైల్వేల నిర్దిష్ట నియమాలను పాటించడం తప్పనిసరి.
రైల్వే నిబంధనల ప్రకారం.. కన్ఫర్మ్ అయిన టికెట్‌ను మీ దగ్గరి బంధువులకు, అంటే మీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా జీవిత భాగస్వామికి మాత్రమే బదిలీ చేయవచ్చు. అయితే రైల్వే అధికారులను ముందుగానే సంప్రదించి, పేర్కొన్న సమయంలోపు దరఖాస్తును సమర్పించడం తప్పనిసరి.
ఎలాంటి ప్రక్రియ ఉంటుంది..? బదిలీ కోసం మీ కన్ఫర్మ్ అయిన టికెట్ ప్రింటవుట్ అవసరం.
ఆధార్ కార్డ్ లేదా ఓటరు ID కార్డ్ : మీరు టికెట్ బదిలీ చేస్తున్న వ్యక్తి వద్ద ఆధార్ లేదా ఓటర్ ఐడి కార్డు ఉండాల్సిందే.
రిజర్వేషన్ కౌంటర్ : మీరు మీ సమీప రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి టికెట్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : టికెట్ బదిలీ కోసం దరఖాస్తును బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు సమర్పించాలి. అయితే, పండుగలు లేదా వ్యక్తిగత సమస్యలు వంటి ప్రత్యేక పరిస్థితులలో దరఖాస్తు సమర్పణ సమయం 48 గంటల ముందుగా ఉండవచ్చు. అలాగే, NCC అభ్యర్థులు ఈ టికెట్ బదిలీ సౌకర్యాన్ని పొందవచ్చు. దరఖాస్తు సమర్పించిన సమయంలో టికెట్ అందుకునే వ్యక్తికి గుర్తింపు కార్డు (ఆధార్ లేదా ఓటరు ఐడి వంటివి) ఉండాలి.
ఈ కొత్త వ్యవస్థ ప్రయాణికులకు చాలా సులభతరం చేసింది. ఒక వైపు టిక్కెట్లు వృధా కావడం ఆగిపోతుంది. మరోవైపు ఏదైనా అత్యవసర పరిస్థితిలో కుటుంబం లేదా దగ్గరి బంధువుల మధ్య టిక్కెట్లను బదిలీ చేయడం సులభం అవుతుంది. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడానికి రైల్వే నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. రైల్వే నిబంధనల ప్రకారం.. టికెట్ బదిలీ అనేది ఒక అవాంతరం లేని ప్రక్రియ కావచ్చు. కానీ మీరు ముందుగానే సిద్ధం చేసుకుని నియమాలను పాటిస్తేనే ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి