FDs interest rate: సీనియర్ల కు ఆ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఏకంగా 8.15 శాతం వడ్డీ

బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలకు ప్రజల ఆదరణ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిపై వడ్డీరేట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. నిర్ణీత కాల వ్యవధికి వడ్డీతొో సహా అసలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం కోరుకునేవారికి ఇవి చాలా బాగుంటాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు బ్యాంకులకు అనుగుణంగా మారుతుంటాయి.

FDs interest rate: సీనియర్ల కు ఆ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఏకంగా 8.15 శాతం వడ్డీ
Follow us

|

Updated on: Oct 01, 2024 | 9:00 PM

బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలకు ప్రజల ఆదరణ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిపై వడ్డీరేట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. నిర్ణీత కాల వ్యవధికి వడ్డీతొో సహా అసలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం కోరుకునేవారికి ఇవి చాలా బాగుంటాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు బ్యాంకులకు అనుగుణంగా మారుతుంటాయి. అందులోనూ సీనియర్ సిటిజన్లకు, సూపర్ సీనియర్లకు వేర్వేరుగా ఇస్తారు. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్ డీలపై అత్యధిక వడ్డీని అందిస్తున్నారు. రూ.మూడు కోట్లు విలువైన డిపాజిట్లపై వడ్డీని పెంచారు. ఈ రేట్లు సెప్టెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.15 శాతం వడ్డీని ప్రకటించారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా

దేశంలోని ప్రముఖ ప్రభుత్వం రంగ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఒకటి. దీనిలో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై ఆకర్షణీయమైన వడ్డీరేట్లు ప్రకటించారు. ముఖ్యంగా మూడు కోట్ల రూపాయల లోపు ఎఫ్ డీలపై వడ్డీ పెంచుతున్నట్టు ఈ బ్యాంకు తాజాగా ప్రకటించింది. 400 రోజుల ఎఫ్ డీపై అత్యధిక వడ్డీని అందిస్తోంది. ఇది సాధారణ ఖాతాదారులకు 7.45 శాతం గా ఉంది, ఇక సీనియర్ సిటీజన్ల 7.95 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు పైబడిన వారు) 8.15 శాతం ప్రకటించింది.

ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడాది నుంచి పదేళ్ల కాలవ్యవధిలో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు ఉన్నాయి. దాాదాపు రూ.25 కోట్ల వరకూ డిపాజిట్లపై వివిధ వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. ఈ సందర్భంగా మూడు కోట్ల లోపు ఎఫ్ డీలపై వడ్డీరేట్లను బ్యాంకు సవరించింది.

ఇవి కూడా చదవండి

ఎఫ్ డీలపై వడ్డీరేట్లు

  • ఒక రూ.కోటి నుంచి మూడు కోట్ల ఫిక్స్ డ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
  • ఒక ఏడాదికాలవ్యవధి కలిగిన డిపాజిట్లకు 6.95 శాతం వడ్డీ ఇస్తారు
  • ఒక ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ (400 రోజుల మినహా) 6.95 శాతం ప్రకటించారు
  • 400 రోజులకు 7.45 శాతం వడ్డీని ఇస్తారు.
  • రెండు సంవత్సరాల వరకూ ఉండే డిపాజిట్లపై 6.95 శాతం అందిస్తున్నారు.
  • రెండు సంవత్సరాల నుంచి మూడేళ్ల కంటే తక్కువ 6.90 శాతం ఇస్తున్నారు.
  • మూడు సంవత్సరాల వ్యవధి కలిగిన ఎఫ్ డీలపై 6.65 శాతం వడ్డీ అందజేస్తున్నారు.

సీనియర్ సిటిజన్లు

సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ ని అందిస్తుంది. సాధారణ ఖాతాదారులతో పోల్చితే వారికి అధికంగా వడ్డీ అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..