AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Deposit: బ్యాంకు డిపాజిటర్లకు శుభవార్త.. అధిక వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులు ఇవే..

ఇటీవలి ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే రానున్న నెలల్లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా ప్రభావితం..

Bank Deposit: బ్యాంకు డిపాజిటర్లకు శుభవార్త.. అధిక వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులు ఇవే..
Subhash Goud
|

Updated on: Oct 13, 2024 | 6:30 PM

Share

ఇటీవలి ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే రానున్న నెలల్లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా ప్రభావితం కావచ్చు. దాదాపు రెండు సంవత్సరాలుగా బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలలో ఎఫ్‌డి పెట్టుబడిదారులు తమ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను అందుకున్నారు. డిపాజిట్లపై అధిక వడ్డీని ఇస్తున్న కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకుల గురించి తెలుసుకుందాం.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1001 రోజుల టర్మ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 9%, సీనియర్ సిటిజన్లకు 9.5% వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు 1 సంవత్సరానికి 7.85%, మూడేళ్లకు 8.15%, 5 సంవత్సరాలకు 8.15%. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% వడ్డీ ఇస్తారు.

ఇవి కూడా చదవండి

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈ బ్యాంక్ 1111 రోజుల కాలవ్యవధిలో సాధారణ కస్టమర్లకు 9%, సీనియర్ సిటిజన్లకు 9.5% గరిష్ట FD వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు 1 సంవత్సరానికి 7%, 3 సంవత్సరాలకు 9% , 5 సంవత్సరాలకు 6.25%. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% వడ్డీని అందిస్తారు.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 8.65%, సీనియర్ సిటిజన్‌లకు 9.15% వడ్డీ రేట్లను 2 సంవత్సరాల 2 రోజుల పాటు అందిస్తుంది. ఈ రేట్లు 1 సంవత్సరానికి 6.85%, 3 సంవత్సరాలకు 8.60%, 5 సంవత్సరాలకు 8.25%. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% వడ్డీని అందిస్తారు.

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 8.55%, సీనియర్ సిటిజన్లకు 9.05% వడ్డీ రేట్లను 18 నెలల నుండి 24 నెలల వరకు అందిస్తుంది. 1 సంవత్సరానికి వడ్డీ రేట్లు 6%, 3 సంవత్సరాలకు 7.50%, 5 సంవత్సరాలకు 6.50%. సీనియర్ సిటిజన్లు 6.50%, 8% , 7% వడ్డీతోపాటు అదనంగా 0.50% పొందుతారు.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు 2 నుండి 3 సంవత్సరాల వరకు సాధారణ కస్టమర్లకు 8.5%, సీనియర్ సిటిజన్లకు 9.10%. 1 సంవత్సరానికి రేట్లు 8%, 3 సంవత్సరాలకు 8.5%, 5 సంవత్సరాలకు 7.75%. సీనియర్ సిటిజన్లు అదనంగా 0.60% వడ్డీని పొందుతారు.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 8.25%, సీనియర్ సిటిజన్లకు 8.75% FD రేట్లను 1 నుండి 3 సంవత్సరాల వరకు అందిస్తుంది. ఈ రేట్లు 1 సంవత్సరానికి 8.25%, 3 సంవత్సరాలకు 8.25%, 5 సంవత్సరాలకు 7.25%. సీనియర్ సిటిజన్లు 0.50% అదనంగా పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !