- Telugu News Photo Gallery Business photos YouTube Updating Skip Ad Button In The UI Changes May Take Effect From The Next Update
YouTube: యూట్యూబ్‌లో యాడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? స్కిప్ చేసేందుకు గూగుల్ కొత్త అప్‌డేట్
Updated on: Oct 13, 2024 | 5:56 PM

YouTubeలో ప్రకటనలను దాటవేయడానికి స్కిప్ బటన్‌పై మరిన్ని అప్‌డేట్‌ల కోసం Google సిద్ధమవుతోంది. వినియోగదారుల ఫిర్యాదులు, అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని యూట్యూబ్ కొత్త సంస్కరణలను సిద్ధం చేస్తోంది. రాబోయే అప్‌డేట్‌లలో ఈ సవరణ అమలు చేయనున్నట్లు గూగుల్ చెబుతోంది.

యాడ్ స్కిప్ బటన్ సరిగ్గా కనిపించడం లేదని చాలా మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. కొన్నిసార్లు స్కిప్ బటన్ పూర్తిగా కనిపించకుండా పోతుందని, కొన్నిసార్లు కౌంట్ డౌన్ ముగిసిన తర్వాత యాడ్ స్కిప్ బటన్ కనిపిస్తోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో యాడ్ స్కిప్ బటన్ కనిపించేలా గూగల్ సిద్ధమవుతోంది. ఇది ప్రకటనలను స్కిప్ చేయడానికి సులభతరం చేస్తుందని Google భావిస్తోంది. దీంతో వీక్షణ అనుభవం కూడా పెరుగుతుందని గూగుల్ చెబుతోంది.

స్కిప్ చేసే యాడ్స్ కొన్ని ఉంటే.. స్కిప్ చేయని యాడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. స్కిమ్ చేసే ప్రకటనలు 15 నుండి 30 సెకన్ల వరకు ఉంటున్నాయి. ఈ కౌంట్‌డౌన్ ముగిసినప్పుడు స్కిప్ యాడ్ బటన్ కనిపిస్తుంది. కానీ ఈ బటన్ కనిపించడం లేదనేది ఫిర్యాదు.

స్కిప్ బటన్ నల్లటి చతురస్రం ద్వారా దాచి ఉంటుందని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. అందువల్ల, ప్రకటనను దాటవేయడం సాధ్యం కాదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో యాడ్ స్కిప్ బటన్‌ను సవరించాలని గూగుల్ నిర్ణయించింది. త్వరలో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.




