- Telugu News Photo Gallery Business photos Bsnl bharat fiber festival dhamaka offer, cuts basic plan price to 399
BSNL Fiber: బీఎస్ఎన్ఎల్ పండుగ ధమకా.. తక్కువ ధరల్లో ఫైబర్ సేవలు!
BSNL ఫైబర్ ప్లాన్‌లు: బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతిరోజూ విభిన్నమైన ఆఫర్‌లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచిన తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు పూర్వ వైభవం వస్తోంది. తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్ష్‌ను అందిస్తోంది. ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ ఒక అద్భుతమైన ఆఫర్‌తో వచ్చింది...
Updated on: Oct 12, 2024 | 8:43 PM

దేశంలో BSNL 4G సేవ అందుబాటులోకి వస్తోంది. కంపెనీ ఇప్పటివరకు 35,000 4G టవర్లను ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని టవర్స్‌ను ఏర్పాటు చేసి 4జీ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే 5జీ నెట్‌వర్క్‌ను కూడా త్వరగా తీసుకువచ్చే పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.

బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రూ.100 తగ్గి రూ.399కి చేరుకుంది. మీరు మూడు నెలల పాటు భారత్ ఫైబర్ సేవను ఆస్వాదించవచ్చు.

కానీ ఈ మూడు నెలల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ రూ.499 వసూలు చేస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ 3300 GB వరకు వినియోగానికి 60 Mbps వేగాన్ని అందిస్తోంది.

అంతేకాదు, ఇప్పుడు భారత్ ఫైబర్ కనెక్షన్ తీసుకునే వారికి మొదటి నెల సర్వీస్ ఉచితంగా అందజేస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ.

BSNL 24వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ తన కస్టమర్లకు అత్యుత్తమ ఆఫర్లను అందిస్తోంది. గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 500 కంటే ఎక్కువ రీఛార్జ్‌ల కోసం 24 జీబీ అదనపు డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.




