- Telugu News Photo Gallery Business photos Business tycoon Ratan Tata Education career Also know about his achievements
Ratan Tata: రతన్ టాటా ఎంత చదువుకున్నారు? అందుకున్న రెండు అత్యున్నత పురస్కారాలు ఏంటి?
Ratan Tata Education : భారతీయ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా లోకం నుంచి దూరం కావడం అందరిని కలచివేసింది. రతన్ టాటా టాటా గ్రూప్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడు. రతన్ టాటా కెరీర్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎందరికో సహాయం చేసిన వ్యక్తి. తన సంపాదనలో సగంకుపైగా పేదల కోసం ఖర్చు ..
Updated on: Oct 14, 2024 | 5:29 PM

Ratan Tata Education : భారతీయ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా లోకం నుంచి దూరం కావడం అందరిని కలచివేసింది. రతన్ టాటా టాటా గ్రూప్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడు. అతను భారతదేశంలోని రెండు అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. అవి పద్మ భూషణ్ (2000), పద్మ విభూషణ్ (2008).

రతన్ టాటా విద్య: రతన్ టాటా 1937 డిసెంబర్ 28న బొంబాయిలో జన్మించారు. అతను ముంబైలోని క్యాంపియన్ స్కూల్ నుండి తన ప్రారంభ విద్యను అభ్యసించాడు. ఇక్కడి నుంచి 8వ తరగతి వరకు చదువు పూర్తి చేశాడు. దీని తరువాత అతను తదుపరి చదువుల కోసం ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌లో చదివారు.

విదేశాల్లో ఉన్నత విద్య: తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, రతన్ టాటా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)కి వెళ్లి కార్నెల్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడ అతను బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (B.Arch) డిగ్రీని పొందాడు. దీని తర్వాత 1975 సంవత్సరంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ చేసాడు.

కెరీర్ ప్రారంభం: రతన్ టాటా 1960ల ప్రారంభంలో టాటా గ్రూప్‌తో తన వృత్తిని ప్రారంభించారు. ప్రారంభంలో అతను టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో సున్నపురాయిని తవ్వడం, బ్లాస్ట్ ఫర్నేస్‌ను నిర్వహించడం వంటి పని చేశాడు. అతను టాటా గ్రూప్‌లో వివిధ కీలక పాత్రలు వహించిన ఘనత రతన్ టాటాది. అలాగే టాటా గ్రూప్‌లోని వివిధ రంగాలలో అనుభవం సంపాదించుకున్నారు.

రతన్ నావల్ టాటా 1991లో టాటా సన్స్ ఛైర్మన్‌గా పనిచేసి 28 డిసెంబర్ 2012న పదవీ విరమణ చేశారు. అతని నాయకత్వంలో గ్రూప్ ఆదాయం అనేక రెట్లు పెరిగింది. టాటా గ్రూప్ తన గ్లోబల్ ఉనికిని విస్తరించింది. ఉక్కు, ఆటోమోటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, హాస్పిటాలిటీ వంటి వివిధ పరిశ్రమలను విస్తరించారు.

బ్రిటీష్ స్టీల్‌మేకర్ కోరస్‌ను టాటా స్టీల్ కొనుగోలు చేయడం, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను టాటా మోటార్స్ కొనుగోలు చేయడంతో సహా వ్యూహాత్మక కొనుగోళ్లను పర్యవేక్షించడం రతన్ టాటా ముఖ్యమైన విజయాలలో ఒకటి.




