Oben Rorr E-bike: ఢిల్లీలో బెంగుళూరు ఈవీ స్టార్టప్ బైక్ హల్‌చల్.. రూ.40 వేల తగ్గింపుతో ప్రత్యేక ఆఫర్
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ ఇటీవలే ఢిల్లీలో కార్యకలాపాలను విస్తరించింది. ఈ కంపెనీ తన రోర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను రూ.1.10 లక్షల (రాష్ట్ర సబ్సిడీతో ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)) ప్రారంభ ధరను ప్రకటించింది. అయితే ఒబెన్ రోర్ ఢిల్లీలో మొదటి 100 మంది కస్టమర్లకు 40,000 తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది . కంపెనీ ఇటీవలే తన మొదటి షోరూమ్‌ను దేశ రాజధానిలో పితంపురాలో ప్రారంభించింది.
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ ఇటీవలే ఢిల్లీలో కార్యకలాపాలను విస్తరించింది. ఈ కంపెనీ తన రోర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను రూ.1.10 లక్షల (రాష్ట్ర సబ్సిడీతో ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)) ప్రారంభ ధరను ప్రకటించింది. అయితే ఒబెన్ రోర్ ఢిల్లీలో మొదటి 100 మంది కస్టమర్లకు 40,000 తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది . కంపెనీ ఇటీవలే తన మొదటి షోరూమ్‌ను దేశ రాజధానిలో పితంపురాలో ప్రారంభించింది. ఢిల్లీ కోసం ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా నగరంలోని కస్టమర్లు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పై గణనీయమైన తగ్గింపును పొందగలుగుతారని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ధర తగ్గుదల అనేది పరిమిత కాలానికి అయినప్పటికీ ఈ-బైక్ సెగ్మెంట్లోని రివోల్ట్ ఆర్‌వీ400, హాప్ ఆక్సో వంటి వాటి ధరలతో పోలిస్తే ఒబెన్ రోర్ మరింత తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ప్రకటన ఢిల్లీలో ఎక్కువ మంది కస్టమర్లను ఓబెన్ రోర్ ఈవీ బైక్ గురించి సెర్చ్ చేసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓబెన్ రోర్ ఈవీ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఓబెన్ రోర్ ఈవీ బైక్ పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌గా ఓబెన్ రోర్ ఘనతను సాధించింది. ఒబెన్ ఎలక్ట్రిక్ ప్రయాణంలో న్యూఢిల్లీ కీలక ఘట్టాన్ని సూచిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పర్యావరణ స్నేహపూర్వక ఉత్పత్తి శ్రేణి అయిన రోర్ ఈవీ బైక్ ఢిల్లీ బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందని వివరిస్తున్నారు. ఒబెన్ రోర్ 8 కేడబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఈ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 187 కిమీ పరిధిని అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గరిష్టంగా 100 కేఎంపీహెచ్ వేగంతో 3 సెకన్లలో 0-40 కేఎంపీహెచ్ నుంచి స్ప్రింట్ చేస్తుంది.
ముఖ్యంగా వచ్చే ఏడాది ప్రాంతంలో దాదాపు 12 షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లతో తన తదుపరి పెద్ద మార్కెట్ ఉండేందుకు ఓబెన్ ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం, కంపెనీ తన హెూమ్ మార్కెట్ అయిన బెంగళూరులో పని చేస్తుండగా ఇటీవల మహారాష్ట్రలోని పూణేతో పాటు కేరళలోని కొచ్చి, త్రివేండ్రంలో కొత్త షోరూమ్‌లను లాంచ్ చేసింది. ఈ కంపెనీ ఆయా నగరాల్లో మొత్తం ఎనిమిది షోరూమ్‌లను ప్రారంభించింది. ఈ సంవత్సరం చివరి నాటికి 12 నగరాల్లో 50 అవుట్‌లెట్‌లకు పైగా విస్తరించాలని ఓబెన్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..