AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual funds: అపోహలు వీడితేనే అధిక రాబడి.. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇవి తెలుసుకోండి..

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే రాబడి బాగుంటుంది. రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అధిక ఆదాయం అందిస్తాయి. వీటిలో పెట్టుబడి పెట్టడానికి అవగాహన చాలా అవసరం. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగింది. చేతిలోని స్మార్ట్ ఫోన్ సాయంతో ప్రపంచంలోని ఏ విషయాన్నైనా తెలుసుకునే వీలు కలిగింది. మ్యూచువల్ ఫండ్స్ వల్ల కలిగే లాభాలు, నష్టాలు తదితర వాటిని కూడా అవగాహన పెంచుకోవచ్చు.

Mutual funds: అపోహలు వీడితేనే అధిక రాబడి.. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇవి తెలుసుకోండి..
Mutual Fund Investing
Madhu
|

Updated on: Jun 21, 2024 | 4:47 PM

Share

గతంలో బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీలు) పథకాలకు ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. వాటిలో తమ డబ్బులను ఇన్వెస్ట్ చేసేవారు. పెట్టుబడికి భద్రత, నిర్ణీత కాల పరిమితికి మెచ్యూర్ అయ్యే అవకాశం ఉండడంతో ఎఫ్ డీలకు ఆదరణ బాగుండేది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ట్రెండ్ నడుస్తోంది. వీటిపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

అధిక రాబడి..

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే రాబడి బాగుంటుంది. రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అధిక ఆదాయం అందిస్తాయి. వీటిలో పెట్టుబడి పెట్టడానికి అవగాహన చాలా అవసరం. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగింది. చేతిలోని స్మార్ట్ ఫోన్ సాయంతో ప్రపంచంలోని ఏ విషయాన్నైనా తెలుసుకునే వీలు కలిగింది. మ్యూచువల్ ఫండ్స్ వల్ల కలిగే లాభాలు, నష్టాలు తదితర వాటిని కూడా అవగాహన పెంచుకోవచ్చు.

ఇన్వెస్టర్ల ప్రాధాన్యం..

మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకునేటప్పుడు పెట్టుబడిదారులు దేనికి ప్రాధాన్యం ఇస్తారు, వారికి ఉండే అభిప్రాయం ఏమిటి అనే అంశాలపై ఇటీవల సర్వే నిర్వహించారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు, నాన్-ఇన్వెస్టర్స్ (మిలీనియల్, జెన్ జెడ్) మధ్య నవీ మ్యూచువల్ ఫండ్ ఈ పరిశోధన చేసింది. దాదాపు 700 మందికి కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంది.

పరిజ్ఞానం అవసరం..

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు ఆర్థిక పరిజ్ఞానం అవసరమని దాదాపు 60 శాతం మంది తెలిపారు. అలాగే వారికి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. మొత్తానికి సర్వే లో తెలిసిన విషయం ఏమిటంటే పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్ పై మరింత అవగాహన అవసరం.

రాబడికి ప్రాధాన్యం..

మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకునే వారిలో ఇద్దరిలో ఒకరు రాబడికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ రెండింటికీ ఈ విషయం వర్తిస్తుంది.

ఇండెక్స్ ఫండ్స్‌పై అవగాహన లేక..

ఇండెక్స్ ఫండ్ ఇన్వెస్టర్లలో ముగ్గురిలో ఒకరికి వాటి గురించి పూర్తిగా అవగాహన లేదు. తక్కువ ఫీజులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాలతోనే ఇండెక్స్ ఫండ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

చాలా ప్రమాదం..

ఇంకో ప్రమాదకర విషయం ఏమిటంటే పెట్టుబడి దారులలో 80 శాతం మంది సోషల్ నెట్‌వర్కులు, పెట్టుబడి సమాచారం కోసం ఫిన్-ఫ్లూన్సర్స్ పై ఆధారపడతున్నారు.

అపోహలు ఇవే..

మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రజలకు అనేక అపోహలు ఉన్నాయి. వారికి సరైన అవగాహన లేకపోవడంతో దానికి కారణం. సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సాధారణంగా ఫండ్స్ పై ప్రజలకు ఉన్న అపోహలు ఇలా ఉన్నాయి.

  • పెట్టుబడికి ఆర్థిక పరిజ్ఞానం అవసరం.. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలంటే ఆర్థిక పరిజ్ఞానం చాలా అవసరమని ప్రజలు నమ్ముతున్నారు. సర్వేలో దాదాపు 60 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అపోహ పెట్టుబడిదారులకు నిరుత్సాహం కలిగిస్తుంది. పెట్టుబడులను నిరోధిస్తుంది.
  • పెట్టుబడికి పెద్ద మొత్తం అవసరం.. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడికి చాలా మొత్తంలో డబ్బు అవసరమని చాలా మంది అపోహ పడతారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇదే భావన ఉంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో పరిమిత మూలధనంతో పెట్టుబడులు పెట్టవచ్చు.
  • పెట్టుబడి సురక్షితం కాదు.. ఇన్వెస్ట్‌మెంట్ యాప్ షట్ డౌన్ అయితే తమ పెట్టుబడులకు భద్రత ఉండదనే భయం కూడా ఉంది. దాదాపు 50 శాతం యూజర్లు ఇలాగే అభిప్రాయపడ్డారు.

అవగాహన అవసరం..

నవీ అధ్యయనంలో తెలుసుకున్నవిషయం ప్రకారం.. పెట్టుబడిదారులకు మరింత ఆర్థిక అక్షరాస్యత కల్పించాలి. ఇందుకోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అపోహలను తొలగించడానికి మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు ప్రయత్నాలు చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..