LIC HFL: హోమ్ లోన్లపై ఎల్ఐసీ బంపర్ ఆఫర్.. ప్రాసెసింగ్ ఫీజుపై ఏకంగా 35 శాతం తగ్గింపు

ఎంత సంపాదించినా సొంత ఇంట్లో ఉంటున్నామనే తృప్తి పొందాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలా ఏళ్ల తరబడి పొదుపు చేస్తూ ఉంటారు. కొంచెం మంది మాత్రం కొంచెం స్మార్ట్‌గా ఆలోచించి నెలనెలా కట్టే అద్దెను ఈఎంఐ రూపంలో కడితే సరిపోతుందనే తలంపుతో హోమ్ లోన్ తీసుకుని సొంతింటి కలను నిజం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసం బ్యాంకులతో పాటు చాలా ఫైనాన్స్ సంస్థలు తక్కువ వడ్డీకే హోమ్‌లోన్లను అందిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ప్రత్యేక ఆఫర్లను అందిస్తూ ఉంటాయి. తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త చెప్పింది.

LIC HFL: హోమ్ లోన్లపై ఎల్ఐసీ బంపర్ ఆఫర్.. ప్రాసెసింగ్ ఫీజుపై ఏకంగా 35 శాతం తగ్గింపు
Home Loan2
Follow us
Srinu

|

Updated on: Jun 21, 2024 | 4:45 PM

సొంతింటి కల అనేది ప్రతి మనిషికి సంబంధించి ధీర్ఘకాలిక కలగా ఉంటుంది. ఎంత సంపాదించినా సొంత ఇంట్లో ఉంటున్నామనే తృప్తి పొందాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలా ఏళ్ల తరబడి పొదుపు చేస్తూ ఉంటారు. కొంచెం మంది మాత్రం కొంచెం స్మార్ట్‌గా ఆలోచించి నెలనెలా కట్టే అద్దెను ఈఎంఐ రూపంలో కడితే సరిపోతుందనే తలంపుతో హోమ్ లోన్ తీసుకుని సొంతింటి కలను నిజం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసం బ్యాంకులతో పాటు చాలా ఫైనాన్స్ సంస్థలు తక్కువ వడ్డీకే హోమ్‌లోన్లను అందిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ప్రత్యేక ఆఫర్లను అందిస్తూ ఉంటాయి. తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త చెప్పింది. కంపెనీ 35 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజుపై 35 శాతం తగ్గింపును ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ జూన్ 19 నుంచి జూన్ 25, 2024 వరకు మంజూరైన హోమ్ లోన్‌లకు ప్రాసెసింగ్ ఫీజుపై 35 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. భారతదేశపు అతిపెద్ద స్వతంత్ర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ తన 35వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆఫర్‌ని అందించింది. గృహ రుణాలపై కంపెనీ ప్రస్తుత వడ్డీ రేటు రూ.2 కోట్ల వరకు రుణాలపై 8.50 శాతం నుండి ప్రారంభమవుతుంది.

ఈ తాజా ఆఫర్ గురించి ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ఎండీ అండ్ సీఈో త్రిభువన్ అధికారి మాట్లాడుతూ మా కస్టమర్ల అచంచలమైన నమ్మకం, మా ఉద్యోగుల అంకితభావంతో మా విజయం అంకితమని వివరించారు. గృహ రుణాల మార్కెట్ డైనమిక్ వృద్ధికి సిద్ధంగా ఉందని, ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తుందని వివరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..