FD Interest Rates: సీనియర్ సిటిజన్లకు యాక్సిస్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలివే..
Axis Bank: ప్రతీ ఒక్కరు తాము సంపాదించిన డబ్బును భద్ర పరుచుకోవడమో.. పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకోవాలనో ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో..
Axis Bank: ప్రతీ ఒక్కరు తాము సంపాదించిన డబ్బును భద్ర పరుచుకోవడమో.. పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకోవాలనో ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వేస్తే.. మరికొందరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతారు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిటర్ల కోసం కొన్ని బ్యాంకులు మంచి మంచి ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ యాక్సి్స్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. సీనియర్ సిటిజన్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంచుకున్న మెచ్చయూరిటీలపై సీనియర్ సిటిజన్లకు యాక్సిస్ బ్యాంకు అధిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ మేరకు యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(ఎఫ్‌డి)లపై వడ్డీ రేట్లు సవరించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు మార్చి 18వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా సవరణల ప్రకారం.. యాక్సిస్ బ్యాంకు 7 రోజులు నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాలాలకు సంబంధించి ఎఫ్‌డీలను అందిస్తోంది.
తాజాగా సవరణల ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుండి 29 రోజుల మెచ్యూరిటీ ఎఫ్‌డిలపై 2.50% వడ్డీ రేటును, 30 రోజుల నుండి 3 నెలల కన్నా తక్కువ మెచ్యూరిటీ కలిగిన ఎఫ్‌డిలకు 3%, 3 నెలల నుంచి 6 వరకు కలిగిన మెచ్యూరిటీ ఎఫ్‌డిలకు 3.5% చొప్పున వడ్డీ రేట్లు ప్రకటించింది. ఇక 6 నెలల నుంచి 11 నెలల 25 రోజుల కంటే తక్కువ మెచ్యూరిటీ కలిగిన ఎఫ్‌డిలకు యాక్సిస్ బ్యాంక్ 4.40% వడ్డీ రేటును ఇస్తుంది. 11 నెలల 25 రోజుల నుండి 1 సంవత్సరం 5 రోజుల కన్నా తక్కువ మెచ్యూరిటీ కలిగిన ఎఫ్‌డీలపై 5.15%, 1 సంవత్సరం 5 రోజుల నుండి 18 నెలల కన్నా తక్కువ ఎఫ్‌డీలపై 5.10%, టర్మ్ డిపాజిట్లు 18 నెలల నుండి 2 సంవత్సరాల కన్నా తక్కువ మెచ్యూరిటీ ఎఫ్‌డీలపై యాక్సిస్ బ్యాంక్ 5.25% వడ్డీని ఇస్తోంది.
దీర్ఘకాలిక డిపాజిట్లలో భాగంగా 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మెచ్యూరిటీ ఎఫ్‌డీలపై యాక్సిస్ బ్యాంక్ 5.40% వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల డిపాజిట్లపై 5.75% వడ్డీ రేటును ఇస్తోంది.
మార్చి 18వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన యాక్సిస్ బ్యాంక్ తాజా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు(రూ. 2 కోట్ల లోపు మాత్రమే) ఇలా ఉన్నాయి.. 7 రోజుల నుండి 14 రోజుల వరకు – 2.50% 15 రోజుల నుండి 29 రోజుల వరకు – 2.50% 30 రోజుల నుండి 45 రోజుల వరకు – 3% 46 రోజుల నుండి 60 రోజులు – 3% 61 రోజులు నుండి 3 నెలలు – 3% 3 నెలలు నుండి 4 నెలలు – 3.5% 4 నెలలు నుండి 5 నెలలు – 3.5% 5 నెలలు నుండి 6 నెలలు – 3.5% 6 నెలలు నుండి 7 నెలలు – 4.40% 7 నెలలు నుండి 8 నెలలు – 4.40% 8 నెలలు నుండి 9 నెలలు – 4.40% 9 నెలలు నుండి 10 నెలలు – 4.40% 10 నెలలు నుండి 11 నెలలు – 4.40% 11 నెలలు నుండి 11 నెలల 25 రోజులు – 4.40% 11 నెలలు 25 రోజుల నుండి 1 సంవత్సరం – 5.15% 1 సంవత్సరం నుండి 1 సంవత్సరం 5 రోజుల వరకు – 5.15% 1 సంవత్సరం 5 రోజులు నుండి 1 సంవత్సరం 11 రోజులు – 5.10% 1 సంవత్సరం 11 రోజులు నుండి 1 సంవత్సరం 25 రోజులు – 5.10% 1 సంవత్సరం 25 రోజులు నుండి 13 నెలలు – 5.10% 13 నెలలు నుండి 14 నెలలు – 5.10% 14 నెలలు నుండి 15 నెలలు – 5.10% 15 నెలలు నుండి 16 నెలలు – 5.10% 16 నెలలు నుండి 17 నెలలు – 5.10% 17 నెలలు నుండి 18 నెలలు – 5.10% 18 నెలలు నుండి 2 సంవత్సరాలు – 5.25% 2 సంవత్సరాలు నుండి 30 నెలలు – 5.40% 30 నెలలు నుండి 3 సంవత్సరాలు – 5.40% 3 సంవత్సరాలు నుండి 5 సంవత్సరాలు – 5.40% 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు – 5.75%
ఇదిలాఉంటే.. ఈ ఏడాది జనవరిలో యాక్సిస్ బ్యాంక్.. 2020 డిసెంబర్ 15వ తేదీ తరువాత 2 లేదా అంతకంటే ఎక్కువ కాలం కోసం బుక్ చేసిన అన్ని కొత్త రిటైల్ టర్మ్ డిపాజిట్లను గడువు కంటే ముందే మూసివేసినా వాటిపై జరిమానాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రిటైల్ కస్టమర్లు ఆకస్మిక ద్రవ్యత అవసరం గురించి చింతించకుండా దీర్ఘకాలిక పొదుపు కోసం వెళ్లేలా ప్రోత్సహించడమే ఈ చర్య ఉద్దేశం అని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. క్రొత్తగా తీసుకువచ్చిన ఈ సవరణలు.. అన్ని కొత్త స్థిర డిపాజిట్లు, పునరావృత డిపాజిట్లకూ వర్తిస్తుందని బ్యాంకర్లు తెలిపారు. అయితే, తాజా సవరణ అనంతరం 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బుక్ చేసుకున్న కొత్త డిపాజిటర్లు.. గడువు ముగియముందే డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకుంటే జరిమానా విధించడం జరుగుతుందని బ్యాంకర్లు స్పష్టం చేశారు.
Also read:
Gold Rates Today: బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…
Google: గూగుల్‌కు ఊహించని షాక్.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కీలక వ్యక్తి.. అసలు కారణమిదేనా?