Home Buying Guide: ఇల్లు కొనేముందు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే మీకే నష్టం!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల ఆశయం. చాలా మంది ఎలాగైనా సొంత ఇళ్లు కొనాలనుకుంటారు. అందుకోసం వారు ఏళ్ల తరబడి చేసిన కష్టాన్ని మొత్తం ఆ ఇంటిపైనే ఖర్చు పెడతారు. అయితే ఇళ్లు కొనే ముందు చేసే చిన్న చిన్న తప్పల కారణంగా వాళ్లు పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి అలాంటి సమస్యలు ఎదుర్కొకుండా.. కొత్త ఇళ్లు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతి ఒక వ్యక్తికి సొంతంగా ఇల్లు కొనడం లేదా నిర్మించుకోవడం అనే జీవిత ఆశయం. దీని కోసం, చాలా మంది చాలా కష్టపడి పని చేసి తమ కలను సాకారం చేసుకోవడానికి డబ్బు ఆదా చేస్తారు. మరికొందరు, డబ్బు ఆదా చేయలేక బ్యాంకు నుండి లోన్స్ తీసుకొని తమ కలను నెరవేర్చుకుంటారు. ఇలాంటి సందర్బాల్లో కొత్త ఇల్లు కొనబోయే లేదా నిర్మించబోయే వ్యక్తులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు అంటున్నారు.
మీ సొంత ఇల్లు కొని నిర్మించే ముందు తెలుసుకోవలసిన విషయాలు
మీ స్వంత ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు, మీరు ఈ కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీరు అనవసరమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడవచ్చు.
మీ వార్షిక ఆదాయానికి 5 రెట్లు మించకూడదు
ఒక వ్యక్తి కొత్త ఇళ్లు కొనాలనుకుంటే.. ఆ ఇంటి మొత్తం ఖర్చు అతని వారి వార్షిక ఆదాయం కంటే 5 రెట్లు మించకుండా చూసుకోవాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి సంవత్సరానికి రూ. 5 లక్షలు సంపాదిస్తే, అతను తన సొంత ఇల్లు కొనే సమయంలో రూ. 25 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే, అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
నెల వారి ఈఎమ్‌ఐ
చాలా మంది కొత్త ఇళ్లు కొనేందుకు, నిర్మించేందుకు బ్యాంక్‌ల నుంచి లోన్స్ తీసుకుంటారు. వాటిని నెల నెల ఈఎమ్‌ఐ రూపంలో చెల్లిస్తుంటారు. ఇలా లోన్ తీసుకొని ఇళ్లు కొనేవారు. వారి నెల ఈఎమ్‌ఐ మీ నెల జీతంలో 40-45 శాతానికి మించకుండ చూసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




