Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీయా మజాకా.. అనంత్-రాధిక పెళ్లిలో ఇన్ని వేల రకాల వంటలా? వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం జూలై 12న జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పెళ్లి గురించి ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నుండి హాలీవుడ్, రాజకీయాల నుండి క్రీడల వరకు పలువురు ప్రముఖులు కూడా ఈ జంట వివాహానికి హాజరయ్యారు. అనంత్-రాధిక వివాహానికి వచ్చిన అతిథుల కోసం అంబానీ..

అంబానీయా మజాకా.. అనంత్-రాధిక పెళ్లిలో ఇన్ని వేల రకాల వంటలా? వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
Anant Radhika Wedding Food Menu
Subhash Goud
|

Updated on: Jul 17, 2024 | 6:54 PM

Share

Anant Radhika Wedding Food Menu : అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం జూలై 12న జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పెళ్లి గురించి ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నుండి హాలీవుడ్, రాజకీయాల నుండి క్రీడల వరకు పలువురు ప్రముఖులు కూడా ఈ జంట వివాహానికి హాజరయ్యారు. అనంత్-రాధిక వివాహానికి వచ్చిన అతిథుల కోసం అంబానీ కుటుంబం ప్రత్యేక ఆహార, పానీయాల ఏర్పాట్లు చేశారు. ఈ వివాహ వేడుకలో రకరకాల వంటలు చేశారు. ఈ ప్రస్తుతం ఈ వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో అనేక రకాల వంటకాలు:

అనంత-రాధికల పెళ్లిలో అతిథులకు 2500 దేశీ, అంతర్జాతీయ వంటకాలు వడ్డించారు. ఈ వంటకాలను వివిధ ఆహార విక్రేతలు తయారు చేశారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లోని మొత్తం అంతస్తు అతిథులకు ఆహారం, పానీయాల కోసం కేటాయించారు. ఈ అంతస్తులో కాశీ ఘాట్‌లు పునర్నిర్మించబడ్డాయి. బనారసీ చాట్‌ని ప్రజలు ఆస్వాదించేవారు. ఈ పెళ్లిలో అతిథులకు బనారసీ పాన్, మద్రాస్ ఫిల్టర్ కాఫీ కూడా అందించారు.

కొబ్బరి వంటకాలు:

అలాగే తినడానికి 100కు పైగా కొబ్బరి వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా ఇండోర్ గరడు చాట్, కుంకుమపువ్వు క్రీమ్ ముంగ్లెట్ వంటి వంటకాలను కూడా అతిథులకు అందించారు. అంతే కాకుండా అనంత్, రాధికల పెళ్లిలో వేల రకాల భోజనాలు వడ్డించారు.

ఎన్నో రకాల స్వీట్లు:

అనంత్-రాధికల పెళ్లిలో అతిథులు కూడా రకరకాల స్వీట్లు తిన్నారు. ఇది కాకుండా, అంబానీ కుటుంబం అతిథులకు లస్సీ, తాండాయి, హైపర్ రియలిస్టిక్ కేక్ ఫ్రూట్స్, డెజర్ట్‌లు, స్వీట్లు, హల్వా, చిక్కీ మొదలైన అనేక తీపి వంటకాలను అందించింది. దీంతోపాటు బెంగాలీ, గుజరాతీ స్వీట్లను కూడా మెనూలో చేర్చారు. స్వీట్లన్నీ స్టాల్స్‌పై అందంగా అలంకరించారు. సర్వింగ్ ట్రే కూడా అమర్చబడింది. తద్వారా అతిథులకు స్వీట్లను సులభంగా అందించేలా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి