FD schemes: ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు అలెర్ట్.. నెలాఖరుతో ముగియనున్న గడువు

బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలకు (ఎఫ్ డీలు) ప్రజల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. డబ్బులు పెట్టుబడి పెట్డడానికి అత్యంత నమ్మకమైన మార్గాలుగా వాటిని భావిస్తారు. నిర్ణీత కాలానికి వడ్డీతో సహా అసలు తీసుకునే అవకాశం, డబ్బులకు పూర్తి భద్రత ఉండడం దీనికి ప్రధాన కారణం. ఎఫ్ డీలపై వడ్డీరేట్లు బ్యాంకుల వారీగా మారుతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారులకంటే ఎక్కువ వడ్డీ అందిస్తాయి.

FD schemes: ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు అలెర్ట్.. నెలాఖరుతో ముగియనున్న గడువు
Money Astrology
Follow us

|

Updated on: Sep 21, 2024 | 6:00 PM

బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలకు (ఎఫ్ డీలు) ప్రజల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. డబ్బులు పెట్టుబడి పెట్డడానికి అత్యంత నమ్మకమైన మార్గాలుగా వాటిని భావిస్తారు. నిర్ణీత కాలానికి వడ్డీతో సహా అసలు తీసుకునే అవకాశం, డబ్బులకు పూర్తి భద్రత ఉండడం దీనికి ప్రధాన కారణం. ఎఫ్ డీలపై వడ్డీరేట్లు బ్యాంకుల వారీగా మారుతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారులకంటే ఎక్కువ వడ్డీ అందిస్తాయి. అయితే ఎస్బీఐ, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంకులకు సంబంధించిన ప్రత్యేక ఎఫ్ డీలలో పెట్టుబడి పెట్టే గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్ అందించే ప్రత్యేక వడ్డీరేటు, నిర్దిష్ట కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీ. ఆ తర్వాత ఈ పథకాలను ఆపివేయనున్నారు. వీటి ద్వారా 300 నుంచి 444 రోజుల కాలవ్యవధిలో ఏడాదికి 7.05 నుంచి 7.35 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. సురక్షితమైన, రాబడి కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇవి సాధారణ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ ఆఫర్ చేస్తాయి.

అధిక వడ్డీ ఇచ్చే ఎఫ్‌డీలు

  • ఐడీబీఐ బ్యాంక్ లో ఉత్సవ్ ఎఫ్ డీ పథకం అందుబాటులో ఉంది. దీనిలో 300, 375, 444, 700 రోజుల కాలవ్యవధికి డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 7.55 నుండి 7.85 శాతం వడ్డీ లభిస్తుంది. సాధారణ, ఎన్ఆర్ఈ (నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్), ఎన్ఆర్వో (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) కేటగిరీలో పెట్టుబడి పెట్టేవారు ఏడాదికి 7.05 నుండి 7.35 శాతం వడ్డీని పొందవచ్చు.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అమృత్ కలాష్ అనే ఎఫ్ డీ పథకం అమలవుతోంది. దీనిలో 400 రోజుల కాల వ్యవధిలో పెట్టుబడి పెట్టాలి. సీనియర్ సిటిజన్లకు 7.10 నుంచి 7.60 శాతం వరకూ వడ్డీ రేటు అందిస్తున్నారు.
  • ఇండియన్ బ్యాంక్ లో ఐఎన్డీ సుప్రీం, ఐఎన్డీ సూపర్ అనే ప్రత్యేక ఎఫ్ డీలు అమలవుతున్నాయి. సుప్రీం పథకంలో 300 రోజుల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లకు 7.05 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. సూపర్ కు సంబంధించి 400 రోజుల కాలవ్యవధిపై 7.25 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. ఈ రేట్లు సాధారణ, ఎన్ ఆర్వో పెట్టుబడిదారులకు వర్తిస్తాయి.

వడ్డీరేట్లు తగ్గే అవకాశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి రేట్లు తగ్గించడం ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చాలా మంది సీనియర్ సిటిజన్లు, రిస్క్ కోరుకోనివారు తమ పెట్టుబడులపై స్థిరమైన రాబడిని పొందడం కోసం ఎఫ్ డీలపై ఆధార పడతారు. అధిక వడ్డీలు ఇచ్చే ఎఫ్ డీలు ముగియనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆలోచన చేయాలి. ప్రస్తుత అధిక వడ్డీ రేట్లతో మీ ఇన్వెస్ట్‌మెంట్‌లను లాక్ చేసుకోవాలి. తద్వారా ఈ ప్రత్యేక ఎఫ్ డీల నుంచి ప్రయోజనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో