Child Education schemes: ఆ పథకాల్లో పెట్టుబడితో పిల్లల భవిష్యత్‌కు ఆర్థిక భరోసా.. టాప్ పెట్టుబడి స్కీమ్స్ ఇవే..!

పిల్లలకు మంచి భవిష్యత్తు అందజేయడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు. వారు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. దాని కోసం అనేక ప్రణాళికలు వేసుకుంటారు. ముఖ్యంగా పిల్లల చదువు కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. ఆ ఖర్చుల కోసం ఎలా పొదుపు చేయాలో వివిధ మార్గాలను అన్వేషిస్తారు. నేటి కాలంలో దీనికి అనేక సులువైన మార్గాలు ఉన్నాయి.

Child Education schemes: ఆ పథకాల్లో పెట్టుబడితో పిల్లల భవిష్యత్‌కు ఆర్థిక భరోసా.. టాప్ పెట్టుబడి స్కీమ్స్ ఇవే..!
Cash
Follow us
Srinu

|

Updated on: Sep 21, 2024 | 6:15 PM

పిల్లలకు మంచి భవిష్యత్తు అందజేయడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు. వారు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. దాని కోసం అనేక ప్రణాళికలు వేసుకుంటారు. ముఖ్యంగా పిల్లల చదువు కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. ఆ ఖర్చుల కోసం ఎలా పొదుపు చేయాలో వివిధ మార్గాలను అన్వేషిస్తారు. నేటి కాలంలో దీనికి అనేక సులువైన మార్గాలు ఉన్నాయి. వాటిలో ప్రతి నెలా కొంత పెట్టుబడి పెడుతూ ఉంటే పిల్లల చదువుకు అవసరమైన సమయంలో ఆ డబ్బులు అండగా ఉంటాయి. మీకు వచ్చే ఆదాయంలో కొంత పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పొదుపును వివిధ మార్గాలలో పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. కాబట్టి పొదుపు చేయడానికి ముందు ప్రణాళిక వేసుకోవాలి. పిల్లలకు అయ్యే విద్యా ఖర్చులను అంచనా వేయాలి. దానికోసం ప్రత్యేక పొదుపు ఖాతాను సృష్టించుకోవాలి. ఈ నేపథ్యంలో పిల్లల చదువు ఖర్చులకు ఉపయోగపడే వివిధ పథకాలను తెలుసుకుందాం.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు (ఎస్ఐపీలు)

మ్యూచువల్ ఫండ్స్‌లోని ఎస్ఐపీలలో ప్రతినెలా పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీర్ఘకాలంలో వీటి నుంచి మంచి రాబడి వస్తుంది. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఎస్ఐపీలలో నెలకు రూ.500 కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.

సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై)

బాలిక కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకంలో నెలా కనీసం రూ.వెయ్యి దాచుకోవచ్చు. బాలికకు 21 ఏళ్లు వచ్చే వరకు లాక్-ఇన్ పీరియడ్‌తో అధిక పన్ను-రహిత రాబడిని అందిస్తుంది. దీనిలో పెట్టుబడికి ఆదాయపు పన్ను మినహాయింపు కూాడా ఉంది.

ఇవి కూడా చదవండి

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)

పొదుపు చేయడానికి పీపీఎఫ్ మరో మంచి ఎంపిక. ఇది 15 ఏళ్ల లాక్-ఇన్ వ్యవధిలో హామీ, పన్ను రహిత రాబడిని అందిస్తుంది. రిస్క్ తీసుకోలేని పెట్టుబడిదారులకు ఇది సురక్షితం.

విద్యా ప్రణాళికలు

పిల్లల చదువుకు సంబంధించి బీమా కంపెనీలు వివిధ ప్లాన్లను అమలు చేస్తున్నాయి. బీమాతో పాటు పొదుపును కలిపి అందజేస్తాయి. పిల్లలకు చదువుకు అవసరమైన సమయంలో ఏక మొత్తంలో డబ్బులను అందిస్తాయి. వీటి వల్ల పిల్లల విద్య అవసరాలు తీరడంతో పాటు, తల్లిదండ్రులు మరణిస్తే ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల (ఎన్ఎస్సీ)లో కూడా డబ్బులను పొదుపు చేసుకోవచ్చు. ఐదేళ్ల కాలవ్యవధికి స్థిరమైన రాబడి అందిస్తాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. అలాగే ఆదాయపుపన్ను చట్టంలోని 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

చైల్డ్-ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్

పిల్లల అవసరాల కోసం చైల్డ్-ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈక్విటీ, డెట్ ఇన్వెస్ట్‌మెంట్లను బ్యాలెన్స్ చేస్తాయి. పిల్లల చదువు కోసం డబ్బులను పొదుపు చేయడానికి వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి