Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: ఆ పత్రాలను ఆన్‌లైన్లో బయటి వ్యక్తులకు పంపుతున్నారా? బీ అలర్ట్.. ఇబ్బందులు తప్పవు..

చాలా మంది ఆధార్ లో అడ్రస్ అప్ డేట్ కోసమనో లేక, మరేదైనా మార్పుల కోసం వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను ఆన్ లైన్ లో పంపిస్తున్నారు. ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా నెట్ సెంటర్లకు పంపిస్తూ ఉంటారు. అయితే అలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయొద్దని ఆధార్ జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) హెచ్చరించింది. అలా చేస్తే అవి అవాంఛిత మార్గాల్లో వినియోగించే అవకాశం ఉంటుందని వివరించింది.

Aadhaar Update: ఆ పత్రాలను ఆన్‌లైన్లో బయటి వ్యక్తులకు పంపుతున్నారా? బీ అలర్ట్.. ఇబ్బందులు తప్పవు..
Aadhaar Update
Follow us
Madhu

|

Updated on: Sep 11, 2023 | 4:15 PM

మన దేశంలో ఆధార్ కార్డు అనేది ప్రాథమిక అవసరం. దేశ పౌరుడిగా ఓ గుర్తింపు కార్డు. అటువంటి కార్డులో డేటా ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంచుకోవడం, భద్రంగా కాపాడుకోవడం అవసరం. ఈ క్రమంలో చాలా మంది ఆధార్ లో అడ్రస్ అప్ డేట్ కోసమనో లేక, మరేదైనా మార్పుల కోసం వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను ఆన్ లైన్ లో పంపిస్తున్నారు. ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా నెట్ సెంటర్లకు పంపిస్తూ ఉంటారు. అయితే అలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయొద్దని ఆధార్ జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) హెచ్చరించింది. ఆధార్ కార్డు అప్ డేట్ కోసమని అడ్రస్ ప్రూఫ్ లేదా ఇతర ఐడెంటిటీలను ఆన్ లైన్ షేర్ చేయొద్దని సూచించింది. అలా చేస్తే అవి అవాంఛిత మార్గాల్లో వినియోగించే అవకాశం ఉంటుందని వివరించింది.

యూఐడీఏఐ అడగదు..

యూఐడీఏఐ సంస్థ ఎప్పుడూ కూడా వ్యక్తుల ధ్రువీకరణ పత్రాలను ఈమెయిల్ లేదా వాట్సాప్ లో అడగదని స్పష్టం చేసింది. ఆధార్ అప్ డేట్ చేయాలంటే కేవలం ఆన్ లైన్ మార్గం మై ఆధార్ పోర్టల్ ద్వారా లేదా ఆధార్ సెంటర్ల ద్వారా మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. యూఐడీఏఐ వెబ్ సైట్ లోని మై ఆధార్ పోర్టల్ ద్వారా వ్యక్తుల స్వయంగా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని లేకుండా ఆధార్ సెంటర్లకు రావొచ్చని సూచించింది.

మాస్క్ డ్ ఆధార్ వాడండి..

గతంలో యూఐడీఏఐ తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ప్రజలకు ఈ విషయమై హెచ్చరించింది. ఏ సంస్థలకు కూడా ఆధార్ కార్డు ఫోటో కాపీలు షేర్ చేయొద్దని సూచించింది. ఒకవేళ ఆధార్ కార్డు కార్డు ఇవ్వాల్సి వస్తే మాస్క్ డ్ ఆధార్ ఇవ్వాలని చెప్పింది. ఈ మాస్క్ డ్ ఆధార్ లో చివరి నాలుగు డిజిట్లు మాత్రమే కనిపిస్తాయి.

సోషల్ మీడియాలో పట్టొద్దు..

పబ్లిక్ ప్లాట్ ఫారాలు అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో ఆధార్ వివరాలు పెట్టొద్దని, ఎవరు అడిగినా చెప్పొద్దని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ఆధార్ కార్డు అన్ని ఆర్థిక లావాదేవాలకు కూడా ఇదే ఆధారం అవుతున్ననేపథ్యంలో వ్యక్తులు జాగ్రత్త వహించాలని సూచించింది. అలాగే వినియోగదారులు తమ ఆధార్ ను ఐడెంటిటీ కింద వినియోగించుకోవచ్చు. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వివరాలను పలు బిల్లుల చెల్లింపుల సమయంలో నిర్భయంగా సమర్పిస్తున్నట్లుగానే ఆధార్ ను ఒక ఐడెంటిటీ ప్రూఫ్ గా అవసరమైన చోట ఎటువంటి భయాలు లేకుండా ఇవ్వవచ్చని కూడా యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.

పదేళ్లుగా అప్ డేట్ చేయని వారు తప్పనిసరి..

పదేళ్లుగా ఆధార్ లో ఎటువంటి మార్పులు చేయని వారు తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కోరింది. అలా చేస్తే బయో మెట్రిక్ వేసేటప్పుడు, లేదా బ్యాంకు ఖాతాలు ప్రారంభించేటప్పుడు, మరేదైనా ప్రభుత్వ సేవలు పొందేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..