AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIFTY@20,000: ఆల్ టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ.. తొలిసారిగా 20 వేల పాయింట్ల ఎగువున..

Nifty at 20,000 Points Milestone: జీ20 శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం కొనసాగుతోంది. నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 20వేల పాయింట్ల మైలురాయిని తాకింది.

NIFTY@20,000: ఆల్ టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ.. తొలిసారిగా 20 వేల పాయింట్ల ఎగువున..
Stock Markets
Janardhan Veluru
|

Updated on: Sep 11, 2023 | 4:01 PM

Share

Nifty at 20,000 Points: జీ20 శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం కొనసాగుతోంది. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా నిఫ్టీ 20వేల పాయింట్ల మైలురాయిని తాకింది. మధ్యాహ్నం 03.30 గం.లకు నిఫ్టీ 180 పాయింట్ల లాభంతో 20,000 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. కేవలం 52 ట్రేడింగ్ సెషన్స్‌లో నిఫ్టీ ఏకంగా 1000 పాయింట్లు లాభపడటం విశేషం.

అటు బీఎస్ఈ సెన్సెక్స్ కూడా సోమవారం ఒక్కరోజే 550 పాయింట్లకు పైగా లాభపడింది. మధ్యాహ్నం 03.30 గం.లకు సెన్సెక్స్ 551 పాయింట్ల లాభంతో 67,150 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. సెంటిమెంట్ బలంగా ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల ఉత్సాహం నెలకొంటోంది. బ్యాకింగ్ రంగ షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, రియలన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్ప్, అపోలో హాస్పిటల్స్ తదితర షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

నిఫ్టీ ప్రస్తానం సాగిందిలా..

2007లో 5000 పాయింట్ల దగ్గరున్న నిఫ్టీ.. 2017 జులైలో 10 వేల పాయింట్లకు చేరుకుంది. అంటే దీనికి పదేళ్ల సమయం తీసుకుంది. అయితే నాలుగేళ్ల తర్వాత  2021 ఫిబ్రవరిలో 15,000 పాయింట్ల మైలురాయిని తాగింది. రెండున్నరేళ్లలో మరో ఐదు వేల పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ.. 2023 సెప్టెంబర్‌ 11న స్టాక్ మార్కెట్  చరిత్రలో తొలిసారిగా 20 వేల పాయింట్ల మార్క్‌ను చేరుకుంది.

పారిశ్రామిక వర్గాల్లో సానుకూనత..

జీ20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటు దేశీయ మదుపర్లు, అటు విదేశీ మదుపర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. కొనుగోళ్ల ఉత్సాహంతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి నిఫ్టీ 25,000 పాయింట్ల మైలురాయిని చేరే అవకాశముందని కొందరు మార్కెట్ నిపుణులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.

ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రపంచ నేతల నుంచి మద్ధతు లభించడం పట్ల భారత పారిశ్రామిక వర్గాల్లోనూ సంతోషం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారల్ 90 డాలర్లకు చేరుకోవడం దేశీయ పారిశ్రామికవర్గాలను కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. అయినా జీ20 సదస్సు సక్సస్ కావడంతో ఆ ఆందోళనలను పటాపంచలు చేస్తూ భారత ఆర్థిక వ్యవస్థపై ఇటు దేశీయ మదుపర్లు, అటు విదేశీ మదుపర్లు నమ్మకాన్ని ఉంచుతున్నారు.

అటు గత వారం ప్రకటించిన 2023-24 వార్షిక సంవత్సరపు తొలి త్రైమాకికంలో జీడీపీ వృద్ధిరేటు అంచనాలను మించి 7.8 శాతంగా నమోదుకావడం దేశీయ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..