AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Policy Status: ఎల్ఐసీ పాలసీ వివరాలు ఇంటి దగ్గర నుంచే తెలుసుకోవచ్చు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు..

ఎల్ఐసీ తన వినియోగదారులకు అందించే సౌకర్యాలు, ఆఫర్ల వంటి పూర్తి వివరాలు ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్లో పొందుపరుస్తుంది. అలాగే ప్లాన్లకు సంబంధించిన వివరాలను బ్రోచర్లు, ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్ వంటి కమ్యూనికేషన్ మోడ్ లలో వినియోగదారులకు సమాచారాన్ని అందిస్తుంది. వీటి ద్వారా పాలసీదారులు తమ పాలసీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఎల్ఐసీ ఆన్ లైన్ లో రిజిస్టర్ కాకుండా మీ పాలసీ స్టేటస్ ను తెలుసుకోవాలంటే ఎలా?

LIC Policy Status: ఎల్ఐసీ పాలసీ వివరాలు ఇంటి దగ్గర నుంచే తెలుసుకోవచ్చు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు..
Lic Policy
Madhu
|

Updated on: Sep 11, 2023 | 3:36 PM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ).. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ. ప్రతి ఒక్కరూ దీనిని పూర్తి భద్రత కలిగిన సంస్థగా పరిగణిస్తాయి. దీనిలో ప్రతి వయస్సు వారికి బీమా కవరేజీ కలిగిన ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. ఎండోమెంట్, మనీ-బ్యాక్, టర్మ్ ప్లాన్‌లతో కూడిన సాధారణ బీమా ప్లాన్‌లతో పాటు, ఎల్ఐసీ పెన్షన్ ప్లాన్‌లు, యూనిట్-లింక్డ్ ప్లాన్‌లు (యూఎల్ఐపీలు), మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అలాగే హెల్త్ ప్లాన్‌లను కూడా ఎల్ఐసీ అందిస్తుంది. ఈ ప్లాన్లు, ఎల్ఐసీ తన వినియోగదారులకు అందించే సౌకర్యాలు, ఆఫర్ల వంటి పూర్తి వివరాలు ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్లో పొందుపరుస్తుంది. అలాగే ఎల్ఐసీ ప్లాన్లకు సంబంధించిన వివరాలను బ్రోచర్లు, ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్ వంటి కమ్యూనికేషన్ మోడ్ లలో వినియోగదారులకు సమాచారాన్ని అందిస్తుంది. వీటి ద్వారా పాలసీదారులు తమ పాలసీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎల్ఐసీ వినియోగదారుడైతే.. ఎల్ఐసీ ఆన్ లైన్ లో రిజిస్టర్ కాకుండా మీ పాలసీ స్టేటస్ ను తెలుసుకోవాలంటే ఎలా? అందుబాటులో ఉన్న మార్గాలేమిటి? తెలుసుకుందాం రండి..

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా ఎల్ఐసీ పాలసీ స్టేటస్..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వారి పాలసీ స్థితిని తనిఖీ చేయడానికి కొత్త దరఖాస్తు దారులు లేక ఇప్పటికే ఉన్న వినియోగదారుల కోసం అన్ని సంబంధిత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచింది. కొత్త వినియోగదారులు పాలసీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎల్‌ఐసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. అందువల్ల ఈ వినియోగదారులు ఎల్‌ఐసి అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఖాతాలోకి లాగిన్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో తమ పాలసీ స్థితిని ఎల్లప్పుడూ తెలుసుకోవచ్చు. అయినప్పటికీ, కొత్త, పాత వినియోగదారులు తమ పాలసీ స్థితిని ఎస్ఎంఎస్ లేదా నేరుగా ఫోన్ కాల్ ద్వారా ఎల్ఐసీ కస్టమర్ కేర్ ప్రతినిధులను సంప్రదించవచ్చు.

ఎల్ఐసీ ఎస్ఎంఎస్ సేవ..

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి ఎల్ఐసీ ఎస్ఎంఎస్ సేవను ఉపయోగించడానికి మీ పాలసీ నంబర్‌ తప్పనిసరి. కొత్త ఎల్ఐసీ పాలసీ కోసం సైన్ అప్ చేస్తున్నప్పుడు, వినియోగదారులు వారి మొబైల్ నంబర్‌తో సహా వారి వ్యక్తిగత సమాచారాన్ని సమర్పించాలి. వినియోగదారులకు సంబంధిత పాలసీ వివరాల గురించి ఆరా తీయడానికి ఎల్ఐసీ 24/7 ఎస్ఎంఎస్ సే పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 922-2492-224 లేదా 56767877కు ఎస్ఎంఎస్ పంపవచ్చు.

  • ఇన్ స్టాల్ మెంట్ ప్రీమియం అమౌంట్ కోసం.. ASKLIC<Your Policy Number>PREMIUM అని టైప్ చేసి పై నంబర్ కు ఎస్ఎంఎస్ పంపాలి.
  • ఎల్ఐసీ పాలసీపై లోన్ కావాలనుకుంటే.. ASKLIC<Your Policy Number>LOAN అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.
  • బోనస్ రేట్ తెలియాలంటే.. ASKLIC<Your Policy Number>BONUS అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.
  • లాప్స్ అయిన పాలసీని తిరిగి ప్రారంభించాలంటే.. ASKLIC<Your Policy Number>REVIVAL అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.
  • నామినీ వివరాలు కావాలంటే..ASKLIC<Your Policy Number>NOMINATION అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.

ఎల్ఐసీ కస్టమర్ కేర్ సేవ..

కస్టమర్ కేర్ ద్వారా ఎల్ఐసీ పాలసీ స్టేటస్ ను తనిఖీ చేయొచ్చు. ఐవీఆర్ఎస్ ద్వారా తక్షణ సేవలను పొందుకోవచ్చు. ఆ నంబర్లను ఇప్పుడు చూద్దాం..

  • హైదరాబాద్ ఫోన్ నంబర్ 040-2342-0730, 040-2342-0740, 040-2342-0761, ఐవీఆర్ఎస్ 040-2343-7997
  • సికింద్రాబాద్ ఫోన్ నంబర్ 040-2782-0146, 040-2782-0136 ప్రత్యేక ఐవీఆర్ఎస్ లేదు.
  • విజయవాడ ఫోన్ నంబర్ 0866-2499-595, 0866-2499-576, 0866-2499-597, ఐవీఆర్ఎస్ నంబర్ 0866-2484-803
  • విశాఖపట్నం ఫోన్ నంబర్ 0891-2558-254, 0891-2513-404, ఐవీఆర్ ఎస్ నంబర్ 0891-2523-473

ఎల్ఐసీ తన వినియోగదారుల సౌలభ్యం కోసం పాలసీల స్థితికి సంబంధించి సంబంధిత సహాయాన్ని పొందడానికి అన్ని మార్గాలను ఏర్పాటు చేసింది. ఎల్ఐసీ వెబ్‌సైట్‌, ఎస్ఎంఎస్, ఫోన్ కాల్ సేవ ద్వారా పాలసీ వివరాలను తెలుసుకోవచ్చు. లేదా ఎల్ఐసీ స్థానిక బ్రాంచ్ ఆఫీస్‌ను సందర్శించవచ్చు. అయితే మీ పాలసీకి సంబంధించిన ఏదైనా నిర్దిష్ట ప్రశ్న కోసం మీ పాలసీ నంబర్‌ను తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవడం ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..