QR Codes Scan: వామ్మో.. ఈజీగా పనవుతుందని క్యూఅర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..
Online fraud: ప్రస్తుత కాలంలో చేతిలో చిల్లిగవ్వ అవసరం లేకుండానే.. అంతా డిజిటల్ చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఎలాంటి చెల్లింపులైనా సరే.. ఫోన్ ఉంటే చాలు సులువుగా పని అవుతోంది. దీంతో అంతా వీటిద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. అయితే, మీరు స్కాన్ చేసే క్యూఆర్ కోడ్ తో మీరు మోసపోతున్నట్లే.. ఎందుకంటే.. క్యూఅర్ కోడ్‌లతో రోజుకు పదుల సంఖ్యలో మోసాలు జరుగుతున్నాయి.
Online fraud: ప్రస్తుత కాలంలో చేతిలో చిల్లిగవ్వ అవసరం లేకుండానే.. అంతా డిజిటల్ చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఎలాంటి చెల్లింపులైనా సరే.. ఫోన్ ఉంటే చాలు సులువుగా పని అవుతోంది. దీంతో అంతా వీటిద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. అయితే, మీరు స్కాన్ చేసే క్యూఆర్ కోడ్ తో మీరు మోసపోతున్నట్లే.. ఎందుకంటే.. క్యూఅర్ కోడ్‌లతో రోజుకు పదుల సంఖ్యలో మోసాలు జరుగుతున్నాయి. చిన్న టెక్నిక్‌తో మనల్ని కమేసి మనకు తెలీకుండానే మన ఖాతాలో డబ్బులు కాజేస్తున్నారు. క్యూఆర్ కోడ్ మోసాలపై ఎంత అవగాహన కల్పించిన బాధితులు నష్టపోతునే ఉన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనిషి డిజిటల్ ప్రపంచంలో దూసుకుపోతున్నాడు. ప్రతి రంగంలోనూ డిజిటల్ వాడకం విపరీతంగా పెరిగింది. అయితే మనిషితో పాటే మనిషి ఆలోచన విధానం కూడా డిజిటల్ అయిపోయింది. లావాదేవీలు మొదలుకుని అన్నిటిలోనూ డిజిటల్ వైపు ప్రయాణం కొనసాగుతుంది. ఈ తరుణంలో సైబర్ కేటుగాళ్లు కూడా తమదైన శైలిలో డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా 2016 నుండి ప్రతి లావాదేవీని డిజిటల్ రూపంలోనే చేస్తున్నారు. దీంతో టీ అమ్మే వాడి దగ్గర నుుసీ కోట్ల విలువ చేసే వస్తువు వరకు అన్నింట్లో డిజిటల్ వైపు బీజం పడింది. ఒకప్పుడు నోట్లతో చెల్లింపులు జరిగితే ఇప్పుడు అంతా ఆన్లైన్ పేమెంట్స్ తోనే కాలం గడుస్తుంది.
ఆన్లైన్ పేమెంట్స్‌ను ఆసరాగా చేసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు మన ఖాతాలో నుంచి లక్షలు కొల్లగొడుతున్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసే పేమెంట్స్‌తో ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించాల్సిన సమయం ఇది. చిన్న చిన్న పేమెంట్స్ నుంచి మొదలుకొని లక్షల రూపాయల దాకా ఒక్క స్కాన్ చేస్తే చాలు మన ఖాతాలో డబ్బు మాయం అవుతాయి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు లేదా ఆన్లైన్ లావాదేవీలు దొరికినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపు చేయాల్సిందిగా చెబుతూ ఉంటారు. అచ్చం అలాంటి క్యూఆర్ కోడ్‌ను బేస్ చేసుకొని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మెసేజ్ రూపంలో ఒక లింక్ క్రియేట్ చేసి ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపించమని మెసేజ్ చేస్తారు. యూపీఐ లింకుకు మనల్ని పేమెంట్ చేసే వరకు తీసుకెళ్తుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఒక ఓటిపి చెప్పాల్సిందిగా నేరగాళ్లు మనల్ని ఒప్పిస్తారు. లాభానికి ఆశపడి మనకు తెలియకుండానే మొత్తం నగదు బదిలీ చేసేస్తాం.. దీంతో మన సొమ్ము మొత్తం మాయమైపోతుంది..
ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఎక్కువగా క్యూఆర్ కోడ్ మోసాలు..
ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఎక్కువగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ షాపింగ్‌లో ఎక్కువమంది డెలివరీ టైమ్‌లో ఏజెంట్ పేమెంట్ సందర్భంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు క్యూఆర్ కోడ్ స్కానర్ అమౌంట్ చూడకుండానే మనం వాటిని స్కాన్ చేసి పేమెంట్ చేస్తూ ఉంటాం. దీని ద్వారా ఎక్కువ అమౌంట్ ఏజెంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి పట్ల కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి.
క్యూఅర్ కోడ్ మోసాలకు దూరంగా ఉండాలంటే ఇది గుర్తుంచుకోండి..
- యూపీఐ ఐడి లేదా బ్యాంక్ వివరాలను తెలియని వారితో అసలు పంచుకోవద్దు.
- ఆన్లైన్ డెలివరీలో ఎక్కువ శాతం క్యాష్ ఆన్ డెలివరికే ప్రిఫర్ చేయండి.
- ఏదైనా లావాదేవీ ఆక్సెప్ట్ చేసేటప్పుడు క్యూఆర్ కోడ్ ఎప్పుడు స్కాన్ చేయవద్దు.
- ఒకవేళ క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తే లావాదేవీల వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి.
మీ బ్యాంకు వివరాలు ఓటిపి పాస్వర్డ్ లేదా పిన్ మీకు తెలియని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు.. ఇవ్వొద్దు.. సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ నెంబర్ 1930 ను ఏర్పాటు చేసింది. ఈ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలనుకుంటే http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..